చెనకితే బిగియఁగఁ జెల్లదా నేఁడు
(॥పల్లవి॥)
చెనకితే బిగియఁగఁ జెల్లదా నేఁడు
జినుగుసిగ్గుల నవ్వు చెల్లదా నీకూ
(॥చెనకితే॥)
కాయ మట పాయ మట కడు వలచితి నట
నేయఁగల ట్టెల్ల నీకు జెల్లదా నేఁడు
నాయంతనె వచ్చెనా నాతుల కిదె చాలు
చేయ మీఁ దాయను నేఁడు చెల్లదా నీకు
(॥చెనకితే॥)
కలి మట బటి మట కదిసి నవ్వే వట
చెలఁగి నే వే మన్నఁ జెల్లదా నేఁడు
చల మెన్నఁటికె యిఁక సాదించవలెఁ గాక
చెలరేఁగి మాటలాడఁ జెల్లదా నీకు
(॥చెనకితే॥)
యిల్లట మంచ మట యేకత మిదే యట
చెల్లఁబో యేమి సేసినఁ జెల్లదా నేఁడు
కొల్లగా శ్రీవెంకటేశ కూడితివి నన్ను నిట్టే
చిల్లరపొందులు మానఁ జెల్లదా నీకూ
(||pallavi||)
sĕnagide bigiyam̐gam̐ jĕlladā nem̐ḍu
jinugusiggula navvu sĕlladā nīgū
(||sĕnagide||)
kāya maḍa pāya maḍa kaḍu valasidi naḍa
neyam̐gala ṭṭĕlla nīgu jĕlladā nem̐ḍu
nāyaṁtanĕ vachchĕnā nādula kidĕ sālu
seya mīm̐ dāyanu nem̐ḍu sĕlladā nīgu
(||sĕnagide||)
kali maḍa baḍi maḍa kadisi navve vaḍa
sĕlam̐gi ne ve mannam̐ jĕlladā nem̐ḍu
sala mĕnnam̐ṭigĕ yim̐ka sādiṁchavalĕm̐ gāga
sĕlarem̐gi māḍalāḍam̐ jĕlladā nīgu
(||sĕnagide||)
yillaḍa maṁcha maḍa yegada mide yaḍa
sĕllam̐bo yemi sesinam̐ jĕlladā nem̐ḍu
kŏllagā śhrīvĕṁkaḍeśha kūḍidivi nannu niṭṭe
sillarabŏṁdulu mānam̐ jĕlladā nīgū