Senagave ramanunim jedulaaraanu

చెనకవే రమణునిఁ జేతులారాను
Language

(॥పల్లవి॥)
చెనకవే రమణునిఁ జేతులారాను
అనుమానించకు నిన్ను నన్నిటా మన్నించెను

(॥చెన॥)
చెలిమే కలిగితేను చేవట్టి పెనఁగవచ్చు
సలిగే లోన(మ) రితేను సాదించవచ్చు
వలపు సతమైతేను వాడిక సేసుకోవచ్చు
నిలువుకు నిలువే నీకేలే సిగ్గులు

(॥చెన॥)
మనసులు గలసితే మాఁటలాడఁగవచ్చు
వినయము లితవైతే వేఁడుకోవచ్చు
చనవులు నిజమైతే సరసము లాడవచ్చు
యినుమడించెఁ దమక మిఁకనేలే సిగ్గులు

(॥చెన॥)
చుట్టరిక మబ్బితేను సొలసి చూడఁగవచ్చు
గుట్టిచ్చితే కాఁగిలించి కూడఁగవచ్చు
యిట్టె శ్రీవేంకటేశుఁ డేలె నిన్ను నింతలోనె
మట్టుమీరె సంతోసము మరియేలే సిగ్గులు

(||pallavi||)
sĕnagave ramaṇunim̐ jedulārānu
anumāniṁchagu ninnu nanniḍā manniṁchĕnu

(||sĕna||)
sĕlime kaligidenu sevaṭṭi pĕnam̐gavachchu
salige lona(ma) ridenu sādiṁchavachchu
valabu sadamaidenu vāḍiga sesugovachchu
niluvugu niluve nīgele siggulu

(||sĕna||)
manasulu galaside mām̐ṭalāḍam̐gavachchu
vinayamu lidavaide vem̐ḍugovachchu
sanavulu nijamaide sarasamu lāḍavachchu
yinumaḍiṁchĕm̐ damaga mim̐kanele siggulu

(||sĕna||)
suṭṭariga mabbidenu sŏlasi sūḍam̐gavachchu
guṭṭichchide kām̐giliṁchi kūḍam̐gavachchu
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnu niṁtalonĕ
maṭṭumīrĕ saṁtosamu mariyele siggulu