చెనకకువయ్య మమ్ము సిగ్గుతోడివారము
(॥పల్లవి॥)
చెనకకువయ్య మమ్ము సిగ్గుతోడివారము
కొన కెక్కించి దించకు కుసిగుంపు లోపము
(॥చెన॥)
చేరి తిట్టినోపము చేచేత మొక్కనోపము
వోరి నీకే యలవాటై యుండుఁ గాని
గారవాన మేలుమీఁదికాంతల మింతే నేము
కూర వండి కస వేరఁ గూడదు మాచేతను
(॥చెన॥)
బాస సేయనోపము పాడిదప్ప నోపము
ఆసకాఁడ నీకే తగు నన్నియుఁ గాని
వాసికి నొడిగట్టినవనితల మింతే నేము
సేస వెట్టి కుల మెంచఁ జెల్లదు మాకిఁకను
(॥చెన॥)
కాకు సేయనోపము గారవించ నోపము
ఆకడ నీకడ నీకే యమరుఁ గాని
యేకమై కూడితి నన్ను నిట్టె శ్రీవేంకటేశ
కైకొని పండినపండు కాయసేయ నోపము
(||pallavi||)
sĕnagaguvayya mammu siggudoḍivāramu
kŏna kĕkkiṁchi diṁchagu kusiguṁpu lobamu
(||sĕna||)
seri tiṭṭinobamu seseda mŏkkanobamu
vori nīge yalavāḍai yuṁḍum̐ gāni
gāravāna melumīm̐digāṁtala miṁte nemu
kūra vaṁḍi kasa veram̐ gūḍadu māsedanu
(||sĕna||)
bāsa seyanobamu pāḍidappa nobamu
āsagām̐ḍa nīge tagu nanniyum̐ gāni
vāsigi nŏḍigaṭṭinavanidala miṁte nemu
sesa vĕṭṭi kula mĕṁcham̐ jĕlladu māgim̐kanu
(||sĕna||)
kāgu seyanobamu gāraviṁcha nobamu
āgaḍa nīgaḍa nīge yamarum̐ gāni
yegamai kūḍidi nannu niṭṭĕ śhrīveṁkaḍeśha
kaigŏni paṁḍinabaṁḍu kāyaseya nobamu