చెంతనున్న చెలులము చెప్పితిమి తగవులు
(॥పల్లవి॥)
చెంతనున్న చెలులము చెప్పితిమి తగవులు
మంతనాన లాలించుటే మగపాడి సుమ్మీ
(॥చెంత॥)
చిగురుఁబెదవులెత్తి నీకు బ్రియములు
జిగిమించ వేఁడుకొని చెక్కునొక్కీని
యెగసక్కేలు నిన్నాడి ఇంతలోనె పంతమిచ్చె
మగువగాఁగిలించుటే మగపాడిసుమ్మీ
(॥చెంత॥)
అందపుఁజన్నులు మోవనప్పటి నీతోఁ బెనఁగి
విందువలె నీచేతికి విడెమిచ్చీని
ముందె బొమ్మల జంకించి మొక్కీ నీకు వినయాన
మందలించి మన్నించుటే మగపాడిసుమ్మీ
(॥చెంత॥)
చక్కనిమోము చూపి సరసము నీతో నాడి
తక్కక గోరఁ జెనకి తమిరేఁచీని
ఇక్కువ శ్రీవేంకటేశ యీకెఁ గరుణించితివి
మక్కువ నిట్టె యేలుటే మగపాడిసుమ్మీ
(||pallavi||)
sĕṁtanunna sĕlulamu sĕppidimi tagavulu
maṁtanāna lāliṁchuḍe magabāḍi summī
(||sĕṁta||)
sigurum̐bĕdavulĕtti nīgu briyamulu
jigimiṁcha vem̐ḍugŏni sĕkkunŏkkīni
yĕgasakkelu ninnāḍi iṁtalonĕ paṁtamichchĕ
maguvagām̐giliṁchuḍe magabāḍisummī
(||sĕṁta||)
aṁdabum̐jannulu movanappaḍi nīdom̐ bĕnam̐gi
viṁduvalĕ nīsedigi viḍĕmichchīni
muṁdĕ bŏmmala jaṁkiṁchi mŏkkī nīgu vinayāna
maṁdaliṁchi manniṁchuḍe magabāḍisummī
(||sĕṁta||)
sakkanimomu sūbi sarasamu nīdo nāḍi
takkaga goram̐ jĕnagi tamirem̐sīni
ikkuva śhrīveṁkaḍeśha yīgĕm̐ garuṇiṁchidivi
makkuva niṭṭĕ yeluḍe magabāḍisummī