చేఁతలు నీవిచూచి సిగ్గయ్యీ మాకు
(॥పల్లవి॥)
చేఁతలు నీవిచూచి సిగ్గయ్యీ మాకు
కాతరమింకా నెంతే కతకారి నీకు
(॥చేఁత॥)
నీడనుండె యలసేవు నిన్ను నీవె సొలసేవు
చేడెరో నీమగఁడు చూచీనంటాను
పాడిపాడి చొక్కేవు పలుమారు నిక్కేవు
యేడ నేరుచుకొంటివే యెమ్మెలాఁడి నీవు
(॥చేఁత॥)
వేసాలకే మురిసేవు వెస ముద్దుగురిసేవు
పోసరించి యాతఁడు పొగడీనంటా
ఆసలు గడు రేఁచేవు అట్టె సిగ్గులు దాఁచేవు
మాసుద్దులు వినరాదా మాయదారి నీవు
(॥చేఁత॥)
బొమ్మనె జంకించేవు పొందులనె లంకించేవు
కమ్మి శ్రీ వేంకటేశుఁడు కైకొనీనంటా
నెమ్మది నన్నేలినాఁడు నేనలమేల్‌మంగను
సమ్మతించ నేరుతువే సటకారి నీవు
(||pallavi||)
sem̐talu nīvisūsi siggayyī māgu
kādaramiṁkā nĕṁte kadagāri nīgu
(||sem̐ta||)
nīḍanuṁḍĕ yalasevu ninnu nīvĕ sŏlasevu
seḍĕro nīmagam̐ḍu sūsīnaṁṭānu
pāḍibāḍi sŏkkevu palumāru nikkevu
yeḍa nerusugŏṁṭive yĕmmĕlām̐ḍi nīvu
(||sem̐ta||)
vesālage murisevu vĕsa muddugurisevu
posariṁchi yādam̐ḍu pŏgaḍīnaṁṭā
āsalu gaḍu rem̐sevu aṭṭĕ siggulu dām̐sevu
māsuddulu vinarādā māyadāri nīvu
(||sem̐ta||)
bŏmmanĕ jaṁkiṁchevu pŏṁdulanĕ laṁkiṁchevu
kammi śhrī veṁkaḍeśhum̐ḍu kaigŏnīnaṁṭā
nĕmmadi nannelinām̐ḍu nenalamelmaṁganu
sammadiṁcha neruduve saḍagāri nīvu