Semtagu jemta sesenu sellumgadave

చేఁతకు జేఁత సేసెను చెల్లుఁగదవే
Language

(॥పల్లవి॥)
చేఁతకు జేఁత సేసెను చెల్లుఁగదవే
యీఁతా మోఁతా నొక్కటాయ నిఁక నేమనేరే

(॥చేత॥)
కన్నుల మొక్కేరు మీరు కాఁకలు చల్లేరు మీరు
యెన్నఁగ రెండూ నడపేరేమే వొక్కంటే
కిన్నెరకాయచన్నుల కేరినవ్వేటిచెక్కుల
సన్నపుగోర నొత్తెను సరసుఁడే అతఁడు

(॥చేత॥)
చేతులుచాఁచేరు మీరు సిగ్గులూఁ బడేరు మీరు
యేతులకు రెండూ నడపే రిదె మీయందే
ఘాతలఁ గొప్పు విరులు కప్పినపయ్యదకొంగు
రీతి నొక్కమాఁటే జారించెఁగదే ఘనుఁడు

(॥చేత॥)
కందువఁ గూడేరు మీరు కడుభ్రమసేరు మీరు
అందాలు రెండూఁ జూపే రంగాలందునే
ముందే శ్రీవేంకటేశుఁడు మోవి ఇచ్చి ముచ్చటాడె
విందులుగా మొహింపించె వేడుకకాఁడే

(||pallavi||)
sem̐tagu jem̐ta sesĕnu sĕllum̐gadave
yīm̐tā mom̐tā nŏkkaḍāya nim̐ka nemanere

(||seda||)
kannula mŏkkeru mīru kām̐kalu salleru mīru
yĕnnam̐ga rĕṁḍū naḍabereme vŏkkaṁṭe
kinnĕragāyasannula kerinavveḍisĕkkula
sannabugora nŏttĕnu sarasum̐ḍe adam̐ḍu

(||seda||)
sedulusām̐seru mīru siggulūm̐ baḍeru mīru
yedulagu rĕṁḍū naḍabe ridĕ mīyaṁde
ghādalam̐ gŏppu virulu kappinabayyadagŏṁgu
rīdi nŏkkamām̐ṭe jāriṁchĕm̐gade ghanum̐ḍu

(||seda||)
kaṁduvam̐ gūḍeru mīru kaḍubhramaseru mīru
aṁdālu rĕṁḍūm̐ jūbe raṁgālaṁdune
muṁde śhrīveṁkaḍeśhum̐ḍu movi ichchi muchchaḍāḍĕ
viṁdulugā mŏhiṁpiṁchĕ veḍugagām̐ḍe