చేఁత సేసేవారు లేరా సిగ్గు విడువరుగాక
(॥పల్లవి॥)
చేఁత సేసేవారు లేరా సిగ్గు విడువరుగాక
పూఁతల రోఁతలకెల్లా బుద్ది చెప్పరాదా
(॥చేఁత॥)
చిత్తము నొచ్చీనంటాఁ జెప్పఁగాక నీమోవి-
జొత్తు లద్దములోనైనాఁ జూచుకోరాదా
హత్తివుండేచెలులైనా నట్టె తుడువరుగాక
కొత్తచెమటలు చూచి కొమలెల్లా నగరా
(॥చేఁత॥)
తలఁచుకొనేవంటాఁ దడవఁగాక నీలోనే
అలపునిట్టూర్పులు ఆలించరాదా
నిలువునవ్వులు సారె నీమేన జారెఁగాక
చలివేఁడిపులక లెంచఁగఁ బచ్చిగాదా
(॥చేఁత॥)
నీకునీకే చెప్పేవంటా నే నడుగఁ జాలఁగాక
యేకతమాడుచు గాని ఇటు రారాదా
పైకొని శ్రీ వేంకటేశ బలిమిఁ గూడితి నన్ను
యీకడాకడిసుద్దులు ఇఁక నెంచనేఁటికి
(||pallavi||)
sem̐ta sesevāru lerā siggu viḍuvarugāga
pūm̐tala rom̐talagĕllā buddi sĕpparādā
(||sem̐ta||)
sittamu nŏchchīnaṁṭām̐ jĕppam̐gāga nīmovi-
jŏttu laddamulonainām̐ jūsugorādā
hattivuṁḍesĕlulainā naṭṭĕ tuḍuvarugāga
kŏttasĕmaḍalu sūsi kŏmalĕllā nagarā
(||sem̐ta||)
talam̐sugŏnevaṁṭām̐ daḍavam̐gāga nīlone
alabuniṭṭūrbulu āliṁcharādā
niluvunavvulu sārĕ nīmena jārĕm̐gāga
salivem̐ḍibulaga lĕṁcham̐gam̐ bachchigādā
(||sem̐ta||)
nīgunīge sĕppevaṁṭā ne naḍugam̐ jālam̐gāga
yegadamāḍusu gāni iḍu rārādā
paigŏni śhrī veṁkaḍeśha balimim̐ gūḍidi nannu
yīgaḍāgaḍisuddulu im̐ka nĕṁchanem̐ṭigi