చేఁత లొకట యుండఁగ చిత్త మొకరి దూరీని
(॥పల్లవి॥)
చేఁత లొకట యుండఁగ చిత్త మొకరి దూరీని
మోఁతలు నీఁడలుఁ జెలిమోహ మింతే కాక
(॥చేఁత॥)
మదనుఁ డెక్కడ నేసె మర్మము లెక్కడఁ గాఁడె
సుదతిచూపులే వాఁడై చొచ్చి వెళ్ళేవి
పొదల పూఁదూపు లేడ భూమిఁ జెఱకువి ల్లేడ
పదర మీ యింతిబొమ్మజంకెనలే కాక
(॥చేఁత॥)
కోవిలకూఁత లేడ గుండెబెదరింపు లేడ
యీవలఁ జెలియెలుఁగు లింతే కాక
తావిఁ జల్లగాలి యేడ తాపము వెంచే దేడ
తేవలఁ జెవినిట్టూర్పు దిష్ట మింతే కాక
(॥చేఁత॥)
పున్నమచందురుఁ డేడ పోదికాఁడై వచ్చు టేడ
మన్నన చెలిమోముమహిమ కాక
యిన్నిటా శ్రీవేంకటేశ యిది నీకే తెలుసును
సన్నల నాకె చేసినజాడ లింతే కాక
(||pallavi||)
sem̐ta lŏgaḍa yuṁḍam̐ga sitta mŏgari dūrīni
mom̐talu nīm̐ḍalum̐ jĕlimoha miṁte kāga
(||sem̐ta||)
madanum̐ ḍĕkkaḍa nesĕ marmamu lĕkkaḍam̐ gām̐ḍĕ
sudadisūbule vām̐ḍai sŏchchi vĕḽḽevi
pŏdala pūm̐dūbu leḍa bhūmim̐ jĕṟaguvi lleḍa
padara mī yiṁtibŏmmajaṁkĕnale kāga
(||sem̐ta||)
kovilagūm̐ta leḍa guṁḍĕbĕdariṁpu leḍa
yīvalam̐ jĕliyĕlum̐gu liṁte kāga
tāvim̐ jallagāli yeḍa tābamu vĕṁche deḍa
tevalam̐ jĕviniṭṭūrbu diṣhṭa miṁte kāga
(||sem̐ta||)
punnamasaṁdurum̐ ḍeḍa podigām̐ḍai vachchu ṭeḍa
mannana sĕlimomumahima kāga
yinniḍā śhrīveṁkaḍeśha yidi nīge tĕlusunu
sannala nāgĕ sesinajāḍa liṁte kāga