చెంపల యేరు ముండ్ల చెంచువారము నీకు
(॥పల్లవి॥)
చెంపల యేరు ముండ్ల చెంచువారము నీకు-
నింపుగాని మా పొందులేలయ్యా
(॥చెంప॥)
కమ్మనిమామయి పూఁత గదరుఁబిల్లుల గబ్బు
యెమ్మెల మాపట్టుచీర యేపెనార
సొమ్ములుఁ బెంచపుకన్నుఁ జూపులయమ్ములనె
వొమ్మదు నీ పొందు నాకు నొల్లమయ్యా
(॥చెంప॥)
కొప్పుగేదఁగులు మాకు కొన నమలీకలు
గొపముత్యాలివి మాకు గురిగింజలు
కప్పురంబు మాకేటి గడ్డల తెల్లని మన్ను
వొప్పదు మాకేల యిచ్చేవొల్లము నేమయ్యా
(॥చెంప॥)
కుంకుమ మా కిపుడు జేగురుఁదొడి నుదుటికి
బింకపుఁ దిట్లె మా ప్రియములు
కంకిగాఁగ నెలయించి కౌఁగిటఁ గూడితి నన్ను
వేంకటవిభుఁడ యిఁక వీడవయ్యా
(||pallavi||)
sĕṁpala yeru muṁḍla sĕṁchuvāramu nīgu-
niṁpugāni mā pŏṁdulelayyā
(||sĕṁpa||)
kammanimāmayi pūm̐ta gadarum̐billula gabbu
yĕmmĕla mābaṭṭusīra yebĕnāra
sŏmmulum̐ bĕṁchabugannum̐ jūbulayammulanĕ
vŏmmadu nī pŏṁdu nāgu nŏllamayyā
(||sĕṁpa||)
kŏppugedam̐gulu māgu kŏna namalīgalu
gŏbamutyālivi māgu gurigiṁjalu
kappuraṁbu māgeḍi gaḍḍala tĕllani mannu
vŏppadu māgela yichchevŏllamu nemayyā
(||sĕṁpa||)
kuṁkuma mā kibuḍu jegurum̐dŏḍi nuduḍigi
biṁkabum̐ diṭlĕ mā priyamulu
kaṁkigām̐ga nĕlayiṁchi kaum̐giḍam̐ gūḍidi nannu
veṁkaḍavibhum̐ḍa yim̐ka vīḍavayyā