Semgalimche nee mogamu jigi naabe daggaride

చెంగలించె నీ మొగము జిగి నాపె దగ్గరితే
Language

(॥పల్లవి॥)
చెంగలించె నీ మొగము జిగి నాపె దగ్గరితే
సంగడి నీ కపుడెంత సంతోసమో

(॥చెంగ॥)
సోగచూపులనుఁ జూచి సుద్దులా పెడుగఁగాను
ఆగతి నీకపుడెంత ఆనందమో
చేగదేర మాఁటలాడి చెక్కులట్టె నొక్కఁగాను
బాగుగ నీకపుడెంత పరిణామమాయనో

(॥చెంగ॥)
కొనగోరు సోఁకఁగ నీకొప్పు ఆపె దువ్వఁగాను
ఘనమైననీ కపుడెంత కళరేఁగెనో
తవియ నీతొడమీద తా దొడవేయగాను
మనసు నీకపుడెంత మర్మము దాఁకెనో

(॥చెంగ॥)
గక్కన నలమేల్మంగ కాఁగిలించుకొనఁగాను
తక్కక నీ కపుడెంత తమ్మివుట్టెనో
అక్కున శ్రీవేంకటేశ ఆపె నిన్నటె కూడఁగా
పక్కన నీ కపుడెంత పరవశమందెనో

(||pallavi||)
sĕṁgaliṁchĕ nī mŏgamu jigi nābĕ daggaride
saṁgaḍi nī kabuḍĕṁta saṁtosamo

(||sĕṁga||)
sogasūbulanum̐ jūsi suddulā pĕḍugam̐gānu
āgadi nīgabuḍĕṁta ānaṁdamo
segadera mām̐ṭalāḍi sĕkkulaṭṭĕ nŏkkam̐gānu
bāguga nīgabuḍĕṁta pariṇāmamāyano

(||sĕṁga||)
kŏnagoru som̐kam̐ga nīgŏppu ābĕ duvvam̐gānu
ghanamainanī kabuḍĕṁta kaḽarem̐gĕno
taviya nīdŏḍamīda tā dŏḍaveyagānu
manasu nīgabuḍĕṁta marmamu dām̐kĕno

(||sĕṁga||)
gakkana nalamelmaṁga kām̐giliṁchugŏnam̐gānu
takkaga nī kabuḍĕṁta tammivuṭṭĕno
akkuna śhrīveṁkaḍeśha ābĕ ninnaḍĕ kūḍam̐gā
pakkana nī kabuḍĕṁta paravaśhamaṁdĕno