Seluvuni kichchagame seyamgadave

చెలువుని కిచ్చకమే సేయఁగదవే
Language

(॥పల్లవి॥)
చెలువుని కిచ్చకమే సేయఁగదవే
అలుగుదురా వట్టి ఆఱడిగానిపుడు

(॥చెలు॥)
పిలిచి తెచ్చినవేళ ప్రియము చెప్పఁగవలె
బలిమి చూపుదురా పతితోను
చెలిమి సేవేటివేళ చెక్కులు నొక్కఁగవలె
చలము సాదింతురా సంగతిగా దిపుడు

(॥చెలు॥)
నవ్వులు నవ్వేటివేళ నయము చూపఁగవలె
రవ్వలు సేయుదురా రమణునిని
పువ్వులు ముడిచేవేళ పొడవు సేయఁగవలె
దువ్వుచునే గోరనూఁదుదురా ఇపుడు

(॥చెలు॥)
ఆసలఁ గూడేటివేళ అట్టె బుజ్జగించవలె
వేసరింతురా శ్రీవేంకటేశ్వరు
బాసలుగొనేటివేళ భ్రమయించఁగవలె
వాసు లెక్కించుక తలవంతురా ఇపుడు

(||pallavi||)
sĕluvuni kichchagame seyam̐gadave
alugudurā vaṭṭi āṟaḍigānibuḍu

(||sĕlu||)
pilisi tĕchchinaveḽa priyamu sĕppam̐gavalĕ
balimi sūbudurā padidonu
sĕlimi seveḍiveḽa sĕkkulu nŏkkam̐gavalĕ
salamu sādiṁturā saṁgadigā dibuḍu

(||sĕlu||)
navvulu navveḍiveḽa nayamu sūbam̐gavalĕ
ravvalu seyudurā ramaṇunini
puvvulu muḍiseveḽa pŏḍavu seyam̐gavalĕ
duvvusune goranūm̐dudurā ibuḍu

(||sĕlu||)
āsalam̐ gūḍeḍiveḽa aṭṭĕ bujjagiṁchavalĕ
vesariṁturā śhrīveṁkaḍeśhvaru
bāsalugŏneḍiveḽa bhramayiṁcham̐gavalĕ
vāsu lĕkkiṁchuga talavaṁturā ibuḍu