చెలువుఁడు వచ్చె వీఁడె సింగారించరే వేగ
(॥పల్లవి॥)
చెలువుఁడు వచ్చె వీఁడె సింగారించరే వేగ
చెలియకుఁ దమకమే చిత్తములో నిండెను
(॥చెఱు॥)
తుమ్మెదలఁ బోలేటి తొయ్యలి తురుమునకు
సమ్మతిఁ దామెర లీరే సంపెఁగలేల
కొమ్మకలువకంటికిఁ గూడుఁ జంద్ర గావిచీర
వొమ్మదు వుదయరాగ మొద్దేలే యిపుడు
(॥చెఱు॥)
మగువసింహమధ్యకు మలయజ మలఁదరే
మృగమద మియ్యకురే మెచ్చు గా దేల
అగుఁ గొలఁకుల పెండె మటు కరియాన కీరే
మొగపుల సింహలమొలనూ లేల
(॥చెలు॥)
యిదె పికవాణి విడె మిచ్చి యాకు మడి చీరే
చెదురుఁ బన్నీటి తోడి చిత్తడి యేల
యెదుట శ్రీవేంకశుఁడింతలో విచ్చేసి కూడె
యిది యది యని యెంచ నిఁకనేల
(||pallavi||)
sĕluvum̐ḍu vachchĕ vīm̐ḍĕ siṁgāriṁchare vega
sĕliyagum̐ damagame sittamulo niṁḍĕnu
(||sĕṟu||)
tummĕdalam̐ boleḍi tŏyyali turumunagu
sammadim̐ dāmĕra līre saṁpĕm̐galela
kŏmmagaluvagaṁṭigim̐ gūḍum̐ jaṁdra gāvisīra
vŏmmadu vudayarāga mŏddele yibuḍu
(||sĕṟu||)
maguvasiṁhamadhyagu malayaja malam̐dare
mṛgamada miyyagure mĕchchu gā dela
agum̐ gŏlam̐kula pĕṁḍĕ maḍu kariyāna kīre
mŏgabula siṁhalamŏlanū lela
(||sĕlu||)
yidĕ pigavāṇi viḍĕ michchi yāgu maḍi sīre
sĕdurum̐ bannīḍi toḍi sittaḍi yela
yĕduḍa śhrīveṁkaśhum̐ḍiṁtalo vichchesi kūḍĕ
yidi yadi yani yĕṁcha nim̐kanela