చెలువుఁడ యెంతైనాఁ జెల్లదా నీకు
(॥పల్లవి॥)
చెలువుఁడ యెంతైనాఁ జెల్లదా నీకు
సెలవు వెట్టితి మాకు చెల్లదా నీకు
(॥॥)
వొరసి నేమిద్దరము నూరకే వాదు లడువఁగ
శిరసు వంచుకుండఁగఁ జెల్లదా నీకు
పరగ మాలో నేమే పగలు చాటుకోఁగా
సిరులతో నవ్వేవు చెల్లదా నీకు
(॥॥)
ముప్పిరి నీకుఁగా మొకాలు చూడకుండఁగ
చెప్పవచ్చేవు సాకిరి చెల్లదా నీకు
రెప్పలతుదల మాకు రేసులు వుంటుండఁగాను
చిప్పిలి మోముకళలు చెల్లదా నీకు
(॥॥)
యిక్కడనే దగ్గరితి మిందరినడుమా వచ్చి
చెక్కుల నొక్కేవు యింతచెల్లదా నీకు
మక్కువ శ్రీ వేంకటేశ మమ్ముఁగూడితి విద్దరి
చిక్కితిమి నీపాలఁజెల్లదా నీకు
(||pallavi||)
sĕluvum̐ḍa yĕṁtainām̐ jĕlladā nīgu
sĕlavu vĕṭṭidi māgu sĕlladā nīgu
(||||)
vŏrasi nemiddaramu nūrage vādu laḍuvam̐ga
śhirasu vaṁchuguṁḍam̐gam̐ jĕlladā nīgu
paraga mālo neme pagalu sāḍugom̐gā
sirulado navvevu sĕlladā nīgu
(||||)
muppiri nīgum̐gā mŏgālu sūḍaguṁḍam̐ga
sĕppavachchevu sāgiri sĕlladā nīgu
rĕppaladudala māgu resulu vuṁṭuṁḍam̐gānu
sippili momugaḽalu sĕlladā nīgu
(||||)
yikkaḍane daggaridi miṁdarinaḍumā vachchi
sĕkkula nŏkkevu yiṁtasĕlladā nīgu
makkuva śhrī veṁkaḍeśha mammum̐gūḍidi viddari
sikkidimi nībālam̐jĕlladā nīgu