Seluvumda vimka nee sittamu gaaga

చెలువుఁడ వింక నీ చిత్తము గాక
Language

(॥పల్లవి॥)
చెలువుఁడ వింక నీ చిత్తము గాక
వలవంత నే నొకరివంటిదాననా

(॥చెలువు॥)
కులుకుఁ జూపుల నిన్నుఁ గొసరు టింతే కాక
అలుగ నీతోనే నంత దాననా
మలసీ సొలసీ నిన్ను మాటల దూరట గాక
అలరి నీ కెదురాడే యంతదాననా

(॥చెలువు॥)
నిండినకాఁకలతోడ నివ్వెఱఁగందుట గాక
అండ నిన్నుఁ గైకొనేయంతదాననా
దండియైన తమకాన తలవంచుకొంట గాక
నిండుదొరవైన నీతో నీటుదాననా

(॥చెలువు॥)
శ్రీవేంకటేశ నీతో సిగ్గున నుండుట గాక
ఆవలిమోమై వుండేయంతదాననా
ఆవటించి కూడితివి అలమేలుమంగ నింతే
వేవేలైనా నీకు వింతదాననా

(||pallavi||)
sĕluvum̐ḍa viṁka nī sittamu gāga
valavaṁta ne nŏgarivaṁṭidānanā

(||sĕluvu||)
kulugum̐ jūbula ninnum̐ gŏsaru ṭiṁte kāga
aluga nīdone naṁta dānanā
malasī sŏlasī ninnu māḍala dūraḍa gāga
alari nī kĕdurāḍe yaṁtadānanā

(||sĕluvu||)
niṁḍinagām̐kaladoḍa nivvĕṟam̐gaṁduḍa gāga
aṁḍa ninnum̐ gaigŏneyaṁtadānanā
daṁḍiyaina tamagāna talavaṁchugŏṁṭa gāga
niṁḍudŏravaina nīdo nīḍudānanā

(||sĕluvu||)
śhrīveṁkaḍeśha nīdo sigguna nuṁḍuḍa gāga
āvalimomai vuṁḍeyaṁtadānanā
āvaḍiṁchi kūḍidivi alamelumaṁga niṁte
vevelainā nīgu viṁtadānanā