చెలువుఁడ నీకు నేము చెప్పవలెనా
(॥పల్లవి॥)
చెలువుఁడ నీకు నేము చెప్పవలెనా
మలసి సొలసి యిట్టె మన్నించవలదా
(॥॥)
చిగురుఁబోడి నీకు జెప్పిన ప్రియములకు
నిగిడి ఇంతటఁ గరుణించ వలదా
మొగముచూచి నీకు మొక్కినట్టి మొక్కులకు
అగపడి నీవు గడు నాదరించవలదా
(॥॥)
యెదురుగా నీకు నింతి యిచ్చిన కానుకలకు
సదరాననే లాలించఁగవలదా
కొదలేక నీవద్దఁ గొలువు సేసినందుకు
మది సంతోసములతో మన్నించ వలదా
(॥॥)
అలమేలుమంగ నీయంకెలఁ గూడినందుకు
మెలఁగి శ్రీవేంకటేశ మెచ్చవలదా
చలపట్టి నీమోవి చవిగొన్న యందుకు
వెలలేని వేడుకల వెలయించ వలదా
(||pallavi||)
sĕluvum̐ḍa nīgu nemu sĕppavalĕnā
malasi sŏlasi yiṭṭĕ manniṁchavaladā
(||||)
sigurum̐boḍi nīgu jĕppina priyamulagu
nigiḍi iṁtaḍam̐ garuṇiṁcha valadā
mŏgamusūsi nīgu mŏkkinaṭṭi mŏkkulagu
agabaḍi nīvu gaḍu nādariṁchavaladā
(||||)
yĕdurugā nīgu niṁti yichchina kānugalagu
sadarānane lāliṁcham̐gavaladā
kŏdalega nīvaddam̐ gŏluvu sesinaṁdugu
madi saṁtosamulado manniṁcha valadā
(||||)
alamelumaṁga nīyaṁkĕlam̐ gūḍinaṁdugu
mĕlam̐gi śhrīveṁkaḍeśha mĕchchavaladā
salabaṭṭi nīmovi savigŏnna yaṁdugu
vĕlaleni veḍugala vĕlayiṁcha valadā