చెలులు వద్దనఁగానే జీరలు దీసేవు మేన
(॥పల్లవి॥)
చెలులు వద్దనఁగానే జీరలు దీసేవు మేన
కలకాలమును నెంత కాతరీఁడవయ్యా
(॥॥)
సగము మాటాడఁగానే సతిచెక్కు నొక్కితివి
మొగిచి చేతులెత్తి మొక్కె నీకాపె
అగపడె నంటానే ఆఁటదాని బైకొంటివి
వెగటున నీకెంత వేగిరమయ్యా
(॥॥)
కొంతగొంత చూడఁగానే కురులు వట్టి తీసితి-
వంతలో వేఁడుకొనీ నిన్నదివో యాపె
మంతనమాయ నంటానే మగువ నలయించితి-
వింతలోఁ దమకము నీకేల వచ్చెనయ్యా
(॥॥)
సమ్మతించి రాఁగానే చన్నులు విసికితివి
పమ్మి పవ్వళించెఁ దొడపైని యాపె
మమ్ముఁ జూచి కన్నెయంటా మన్నించి శ్రీవేంకటేశ
నెమ్మదిఁ బదరితివి నిండువలపయ్యా
(||pallavi||)
sĕlulu vaddanam̐gāne jīralu dīsevu mena
kalagālamunu nĕṁta kādarīm̐ḍavayyā
(||||)
sagamu māḍāḍam̐gāne sadisĕkku nŏkkidivi
mŏgisi sedulĕtti mŏkkĕ nīgābĕ
agabaḍĕ naṁṭāne ām̐ṭadāni baigŏṁṭivi
vĕgaḍuna nīgĕṁta vegiramayyā
(||||)
kŏṁtagŏṁta sūḍam̐gāne kurulu vaṭṭi tīsidi-
vaṁtalo vem̐ḍugŏnī ninnadivo yābĕ
maṁtanamāya naṁṭāne maguva nalayiṁchidi-
viṁtalom̐ damagamu nīgela vachchĕnayyā
(||||)
sammadiṁchi rām̐gāne sannulu visigidivi
pammi pavvaḽiṁchĕm̐ dŏḍabaini yābĕ
mammum̐ jūsi kannĕyaṁṭā manniṁchi śhrīveṁkaḍeśha
nĕmmadim̐ badaridivi niṁḍuvalabayyā