Selulu tannevvaremta sesinaam jesirigaani

చెలులు తన్నెవ్వరెంత చేసినాఁ జేసిరిగాని
Language

(॥పల్లవి॥)
చెలులు తన్నెవ్వరెంత చేసినాఁ జేసిరిగాని
వలవని గర్వాలు వారే కట్టుకోనీవే

(॥చెలు॥)
పొదిగి తనగుణాలు పొగడఁగఁదగుఁగాక
అద నెఱఁగక వెంగెమాడఁదగునా
వెదకి తానున్నచోటు విచారించఁదగుంగాక
యెదుటఁ బరాకుతో నెలయించఁదగునా

(॥చెలు॥)
వైళము తాఁ జెప్పినటువలెఁ జేయఁదగుంగాక
నాలిసేసి తనతోఁ బెనఁగఁదగునా
మేలుసేసినందుకు మెచ్చఁగఁదగుగాక
కూళతనమున మరీఁ గొసరఁగఁదగునా

(॥చెలు॥)
వొక్కటై పొందుసేసితే నొడఁబడఁదగుఁగాక
చక్కఁగా నెడమాటాడించఁగఁదగునా
ఇక్కడ శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
దక్కె నాకు నతఁడు నే దమకించఁదగునా

(||pallavi||)
sĕlulu tannĕvvarĕṁta sesinām̐ jesirigāni
valavani garvālu vāre kaṭṭugonīve

(||sĕlu||)
pŏdigi tanaguṇālu pŏgaḍam̐gam̐dagum̐gāga
ada nĕṟam̐gaga vĕṁgĕmāḍam̐dagunā
vĕdagi tānunnasoḍu visāriṁcham̐daguṁgāga
yĕduḍam̐ barāgudo nĕlayiṁcham̐dagunā

(||sĕlu||)
vaiḽamu tām̐ jĕppinaḍuvalĕm̐ jeyam̐daguṁgāga
nālisesi tanadom̐ bĕnam̐gam̐dagunā
melusesinaṁdugu mĕchcham̐gam̐dagugāga
kūḽadanamuna marīm̐ gŏsaram̐gam̐dagunā

(||sĕlu||)
vŏkkaḍai pŏṁduseside nŏḍam̐baḍam̐dagum̐gāga
sakkam̐gā nĕḍamāḍāḍiṁcham̐gam̐dagunā
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
dakkĕ nāgu nadam̐ḍu ne damagiṁcham̐dagunā