చెలులు గనుఁగొనరె యీ సింగారము
(॥పల్లవి॥)
చెలులు గనుఁగొనరె యీ సింగారము
నిలువెల్ల రతికళలు నిండుకొను మాడ్కి
(॥చెలు॥)
అతివవురమున కంఠహరములు కడుఁ బెక్కు
తతిఁ గట్టుకొన్నచందంబమరెను
కతలుగా ముఖచంద్రుఁగని చన్నుజక్కవలు
క్షితిఁ బాయకుండ లంకెలఁ బెనఁచినట్లు
(॥చెలు॥)
సుదతి నెన్నుదుటఁ గస్తూరినామము వెలయ
చెదరకుండఁగ దీర్చిన భావము
పొదినూర్పుగాలిచప్పుడుకుఁ గనుచకొరాలు
కదలకుండఁగఁ గట్టుకంభమో యనఁగా
(॥చెలు॥)
నెలఁత శిరసున విరులు నించుకొనె నీ సొబగు
కలిగి శ్రీ వేంకటేశుఁ గదిసి వుండి
కలికి నాసిక చనుపకము తావికి కురుల
అలులు వోకుండ వలలమరించుగతిని
(||pallavi||)
sĕlulu ganum̐gŏnarĕ yī siṁgāramu
niluvĕlla radigaḽalu niṁḍugŏnu māḍki
(||sĕlu||)
adivavuramuna kaṁṭhaharamulu kaḍum̐ bĕkku
tadim̐ gaṭṭugŏnnasaṁdaṁbamarĕnu
kadalugā mukhasaṁdrum̐gani sannujakkavalu
kṣhidim̐ bāyaguṁḍa laṁkĕlam̐ bĕnam̐sinaṭlu
(||sĕlu||)
sudadi nĕnnuduḍam̐ gastūrināmamu vĕlaya
sĕdaraguṁḍam̐ga dīrsina bhāvamu
pŏdinūrbugālisappuḍugum̐ ganusagŏrālu
kadalaguṁḍam̐gam̐ gaṭṭugaṁbhamo yanam̐gā
(||sĕlu||)
nĕlam̐ta śhirasuna virulu niṁchugŏnĕ nī sŏbagu
kaligi śhrī veṁkaḍeśhum̐ gadisi vuṁḍi
kaligi nāsiga sanubagamu tāvigi kurula
alulu voguṁḍa valalamariṁchugadini