చెలులెల్లాఁ జూచి సంతోసించి మెచ్చి పొగడేరు
(॥పల్లవి॥)
చెలులెల్లాఁ జూచి సంతోసించి మెచ్చి పొగడేరు
కలిగె నీకు మేలము కలకాలము
(॥చెలు॥)
చెలియ నీవద్దనుండి సెలవి నవ్విన నవ్వు
వెలలేని వలపుల వెన్నెలపువ్వు
అలవోక నీమీఁదనంట జూచినచూపు
తలకొన్న జవ్వనమదము తరితీపు
(॥చెలు॥)
పొంచి నీదేవులు నీతోఁ బూఁచి యాడినపలుకు
వంచి తీసిన మరువాఁడిచిలుకు
అంచి నీయెదుటఁ బచరించిన సింగారము
పంచలఁ బదారువన్నె బంగారము
(॥చెలు॥)
వనిత నీతోఁబెనఁగి వలలఁబెట్టిన యాస
మునుకొన్న తమితోడి ముత్తేల సేస
చనవిచ్చి శ్రీవెంకటేశ్వర యీకెనేలితివి
చెనకురతిమెండు చెరకునఁ బండు
(||pallavi||)
sĕlulĕllām̐ jūsi saṁtosiṁchi mĕchchi pŏgaḍeru
kaligĕ nīgu melamu kalagālamu
(||sĕlu||)
sĕliya nīvaddanuṁḍi sĕlavi navvina navvu
vĕlaleni valabula vĕnnĕlabuvvu
alavoga nīmīm̐danaṁṭa jūsinasūbu
talagŏnna javvanamadamu taridību
(||sĕlu||)
pŏṁchi nīdevulu nīdom̐ būm̐si yāḍinabalugu
vaṁchi tīsina maruvām̐ḍisilugu
aṁchi nīyĕduḍam̐ basariṁchina siṁgāramu
paṁchalam̐ badāruvannĕ baṁgāramu
(||sĕlu||)
vanida nīdom̐bĕnam̐gi valalam̐bĕṭṭina yāsa
munugŏnna tamidoḍi muttela sesa
sanavichchi śhrīvĕṁkaḍeśhvara yīgĕnelidivi
sĕnaguradimĕṁḍu sĕragunam̐ baṁḍu