Selulamu nemu neegu jeppebuddulu vinave

చెలులము నేము నీకు జెప్పేబుద్దులు వినవే
Language

(॥పల్లవి॥)
చెలులము నేము నీకు జెప్పేబుద్దులు వినవే
చలివాసి వుందానవు చల మెటువంటిదో

(॥చెలు॥)
తప్పక చూచినవాఁడు దయసేయకమానీనా
ఇప్పుడేలే వేగిరము ఇంతిరో నీవు
ముప్పిరిగొని చెమట మోమెల్లా నిండె నీకు
కప్పి నీ మనసులోనికాఁతాళ మెట్టిదో

(॥చెలు॥)
మక్కువచేసినవాఁడు మన్నించకమానీనా
వెక్కసాన దూరకువే వెలఁది నీవు
గక్కననుఁ గెంపుదేరె కన్నుల తుదల నీకు
కక్కసించి తమకపుకాఁక యెంతవున్నదో

(॥చెలు॥)
చేయిచాఁచినవాఁడు సిగ్గుదేర్చకమానీనా
రాయడించుకునే యిఁక రమణి నీవు
యీయెడ శ్రీవేంకటేశుఁడీతఁ డిట్టె నిన్నుఁ గూడె
చాయల మై పులకించె సంతోస మేరీతిదో

(||pallavi||)
sĕlulamu nemu nīgu jĕppebuddulu vinave
salivāsi vuṁdānavu sala mĕḍuvaṁṭido

(||sĕlu||)
tappaga sūsinavām̐ḍu dayaseyagamānīnā
ippuḍele vegiramu iṁtiro nīvu
muppirigŏni sĕmaḍa momĕllā niṁḍĕ nīgu
kappi nī manasulonigām̐tāḽa mĕṭṭido

(||sĕlu||)
makkuvasesinavām̐ḍu manniṁchagamānīnā
vĕkkasāna dūraguve vĕlam̐di nīvu
gakkananum̐ gĕṁpuderĕ kannula tudala nīgu
kakkasiṁchi tamagabugām̐ka yĕṁtavunnado

(||sĕlu||)
seyisām̐sinavām̐ḍu siggudersagamānīnā
rāyaḍiṁchugune yim̐ka ramaṇi nīvu
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ḍīdam̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
sāyala mai pulagiṁchĕ saṁtosa merīdido