Selulamu nemanna sittamu nee kettumduno

చెలులము నేమన్న చిత్తము నీ కెట్టుండునో
Language

(॥పల్లవి॥)
చెలులము నేమన్న చిత్తము నీ కెట్టుండునో
యెలమి నీచేఁత లివె యెంచుకోరాదా

(॥చెలు॥)
మోవిచవిగొనేవేళ మొగము చూడఁగఁబోతే
భావించి జాణలకు కోపమురాదా
చేవదేర నిందు కాపె చేతనంటెనవి దూరే
వీవల నెవ్వరితప్పో యెంచుకోరాదా

(॥చెలు॥)
చన్నుల నొ త్తేటివేళ సరసములాడఁబోతే
విన్నకన్నవారికైన వెగటుగాదా
తిన్నని మాటల నిట్టే తిట్టెనంటా నాడేవు
ఇన్నిటా తగవు నీవే యెంచుకోరాదా

(॥చెలు॥)
చొక్కేటి రతుల వేళ సొంట్లు సోదించఁబోతే
నిక్కపు శ్రీవేంకటేశ నిన్ను దూరరా
తక్కక నీవు గూడితే తరుణి నవ్వె ననేవు
యెక్కువ తక్కువ నీవే యెంచుకోరాదా

(||pallavi||)
sĕlulamu nemanna sittamu nī kĕṭṭuṁḍuno
yĕlami nīsem̐ta livĕ yĕṁchugorādā

(||sĕlu||)
movisavigŏneveḽa mŏgamu sūḍam̐gam̐bode
bhāviṁchi jāṇalagu kobamurādā
sevadera niṁdu kābĕ sedanaṁṭĕnavi dūre
vīvala nĕvvaridappo yĕṁchugorādā

(||sĕlu||)
sannula nŏ tteḍiveḽa sarasamulāḍam̐bode
vinnagannavārigaina vĕgaḍugādā
tinnani māḍala niṭṭe tiṭṭĕnaṁṭā nāḍevu
inniḍā tagavu nīve yĕṁchugorādā

(||sĕlu||)
sŏkkeḍi radula veḽa sŏṁṭlu sodiṁcham̐bode
nikkabu śhrīveṁkaḍeśha ninnu dūrarā
takkaga nīvu gūḍide taruṇi navvĕ nanevu
yĕkkuva takkuva nīve yĕṁchugorādā