Selulamu nemainaam jeppavale buddi neegu

చెలులము నేమైనాఁ జెప్పవలె బుద్ది నీకు
Language

(॥పల్లవి॥)
చెలులము నేమైనాఁ జెప్పవలె బుద్ది నీకు
అలుకలు పనిలేవు ఆఱడిఁ బెట్టకువే

(॥చెలు॥)
మంతనాననున్నవేళ మరి తగదే సిగ్గులు
పంతములాడేటివేళ భయములేల
సంతోషమైనప్పుడు చలపట్టఁగూడదు
రంతుల దూర కతని రమ్మనవే ఇంటికి

(॥చెలు॥)
యెదురుబడివుండే యేల సాకిరు లడుగ
వుదుటులు నెరపుతా నొడ్డుకోవద్దు
చతురులాడేచోట జగడాలు పనిలేవు
పదరనేల యిట్టె పతి కిచ్చలాడవే

(॥చెలు॥)
కూడితిరి మీ రిద్దరు గుంపెన లిఁకనేఁటికే
యీడైన చుట్టరికాన కెగ్గులేడవే
వేడుకతోడ నిన్ను శ్రీవేంకటేశుఁడు పెండ్లాడె
జాడతో యీతనిమీఁద జల్లవే యీసేసలు

(||pallavi||)
sĕlulamu nemainām̐ jĕppavalĕ buddi nīgu
alugalu panilevu āṟaḍim̐ bĕṭṭaguve

(||sĕlu||)
maṁtanānanunnaveḽa mari tagade siggulu
paṁtamulāḍeḍiveḽa bhayamulela
saṁtoṣhamainappuḍu salabaṭṭam̐gūḍadu
raṁtula dūra kadani rammanave iṁṭigi

(||sĕlu||)
yĕdurubaḍivuṁḍe yela sāgiru laḍuga
vuduḍulu nĕrabudā nŏḍḍugovaddu
sadurulāḍesoḍa jagaḍālu panilevu
padaranela yiṭṭĕ padi kichchalāḍave

(||sĕlu||)
kūḍidiri mī riddaru guṁpĕna lim̐kanem̐ṭige
yīḍaina suṭṭarigāna kĕgguleḍave
veḍugadoḍa ninnu śhrīveṁkaḍeśhum̐ḍu pĕṁḍlāḍĕ
jāḍado yīdanimīm̐da jallave yīsesalu