చెలులము నేమైనాఁ జెప్పక పోదు
(॥పల్లవి॥)
చెలులము నేమైనాఁ జెప్పక పోదు
తలఁపులోపలి యాస దాఁచఁ దగునటవే
(॥చెలు॥)
ఇతవుగఁ జెనకఁగా నింపులెల్లాఁ జల్లఁగాను
తతిగొని పెనఁగఁగఁ దగునటవే
సతమై దండనుండఁగా సారె సారె నవ్వఁగాదు
మతకాన వెంగెమాడ మరి తగునటవే
(॥చెలు॥)
కప్పురములియ్యఁగాను కన్నులను మొక్కఁగాను
తప్పులు వట్టఁగ నీకుఁ దగునటవే
దప్పిదేర విసరఁగా దయవుట్టఁ బలుకఁగా
నప్పటిఁ గాఁతాళించుటది దగునటవే
(॥చెలు॥)
బత్తులు సేయఁగాను పైకొని కూడఁగాను
తత్తరాన గోరఁ జిమ్మఁ దగునటవే
హత్తి శ్రీవేంకటేశుఁ డన్నిటా మన్నించె నిన్ను
కొత్తరతులఁ బంతము గొనఁ దగునటవే
(||pallavi||)
sĕlulamu nemainām̐ jĕppaga podu
talam̐pulobali yāsa dām̐sam̐ dagunaḍave
(||sĕlu||)
idavugam̐ jĕnagam̐gā niṁpulĕllām̐ jallam̐gānu
tadigŏni pĕnam̐gam̐gam̐ dagunaḍave
sadamai daṁḍanuṁḍam̐gā sārĕ sārĕ navvam̐gādu
madagāna vĕṁgĕmāḍa mari tagunaḍave
(||sĕlu||)
kappuramuliyyam̐gānu kannulanu mŏkkam̐gānu
tappulu vaṭṭam̐ga nīgum̐ dagunaḍave
dappidera visaram̐gā dayavuṭṭam̐ balugam̐gā
nappaḍim̐ gām̐tāḽiṁchuḍadi dagunaḍave
(||sĕlu||)
battulu seyam̐gānu paigŏni kūḍam̐gānu
tattarāna goram̐ jimmam̐ dagunaḍave
hatti śhrīveṁkaḍeśhum̐ ḍanniḍā manniṁchĕ ninnu
kŏttaradulam̐ baṁtamu gŏnam̐ dagunaḍave