Selulamu neegu nemu seppagabodu

చెలులము నీకు నేము చెప్పకపోదు
Language

(॥పల్లవి॥)
చెలులము నీకు నేము చెప్పకపోదు
చెలరేఁగి యీతనికి సేవసేయరాదా

(॥॥)
చెలి నీపెదవిపై చేయి చేర్చితివి నేఁడు
యిలఁ జిగురులుగదే యివిరెండును
పలుకుఁ దేనెలు నీపతి కేలదాఁచేవే
చలివాయ నీతనికి చవిచూపరాదా

(॥॥)
చూపులకు నద్దాలు సొనిపేవు కురులను
యేపునఁ దేటులేకదే యివిరెండును
ఆఁపనేలే వెన్నెలన వ్వాతనియెదుట నీవు
రాఁపులుగా ముందటను రాశివోయరాదా

(॥॥)
చన్నులకుఁ గరములు సరినడ్డాలు పెట్టేవు
యెన్నఁ దామెరలేకదే యివి రెండును
కన్నెరో కాఁగిట శ్రీవేంకటేశుఁ గూడితివి
అన్నిటా నీముచ్చటలు ఆనతియ్యరాదా

(||pallavi||)
sĕlulamu nīgu nemu sĕppagabodu
sĕlarem̐gi yīdanigi sevaseyarādā

(||||)
sĕli nībĕdavibai seyi sersidivi nem̐ḍu
yilam̐ jigurulugade yivirĕṁḍunu
palugum̐ denĕlu nībadi keladām̐seve
salivāya nīdanigi savisūbarādā

(||||)
sūbulagu naddālu sŏnibevu kurulanu
yebunam̐ deḍulegade yivirĕṁḍunu
ām̐panele vĕnnĕlana vvādaniyĕduḍa nīvu
rām̐pulugā muṁdaḍanu rāśhivoyarādā

(||||)
sannulagum̐ garamulu sarinaḍḍālu pĕṭṭevu
yĕnnam̐ dāmĕralegade yivi rĕṁḍunu
kannĕro kām̐giḍa śhrīveṁkaḍeśhum̐ gūḍidivi
anniḍā nīmuchchaḍalu ānadiyyarādā