Selulamu mumdugaane seppemu buddulu neegu

చెలులము ముందుగానే చెప్పేము బుద్దులు నీకు
Language

(॥పల్లవి॥)
చెలులము ముందుగానే చెప్పేము బుద్దులు నీకు
చెలఁగి సేవసేయవే చిత్తమురాఁ బతికి

(॥చెలు॥)
పొంచి కొంగువట్టితేను బొమ్మల జంకించకువే
కొంచక మోవెడిగితే గుంపించకువే
అంచెల గుబ్బలంటితే నానలు వెట్టకువే
మించి నీమగఁడు కడుమేలువాఁడే నీకు

(॥చెలు॥)
చెనకితే నాతనితో సిగ్గులువడకువే
పెనఁగవచ్చితే నీవు బిగియకువే
యెనసి నవ్వితే నందు కెగ్గులువట్టకువే
ఘనుఁడు నీపై బత్తిగలఁడే యెపుడు

(॥చెలు॥)
పలుమారుఁ జూచితేను పదరి దూరకువే
అలమితే రతులను నలయకువే
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
యిల నిన్ను నేలె నీకు యిచ్చకపువాఁడే

(||pallavi||)
sĕlulamu muṁdugāne sĕppemu buddulu nīgu
sĕlam̐gi sevaseyave sittamurām̐ badigi

(||sĕlu||)
pŏṁchi kŏṁguvaṭṭidenu bŏmmala jaṁkiṁchaguve
kŏṁchaga movĕḍigide guṁpiṁchaguve
aṁchĕla gubbalaṁṭide nānalu vĕṭṭaguve
miṁchi nīmagam̐ḍu kaḍumeluvām̐ḍe nīgu

(||sĕlu||)
sĕnagide nādanido sigguluvaḍaguve
pĕnam̐gavachchide nīvu bigiyaguve
yĕnasi navvide naṁdu kĕgguluvaṭṭaguve
ghanum̐ḍu nībai battigalam̐ḍe yĕbuḍu

(||sĕlu||)
palumārum̐ jūsidenu padari dūraguve
alamide radulanu nalayaguve
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
yila ninnu nelĕ nīgu yichchagabuvām̐ḍe