చెలులము మాచేతఁ జెప్పించరాదు
(॥పల్లవి॥)
చెలులము మాచేతఁ జెప్పించరాదు
వెలయ నాతఁడు నీవు విచారించుకొనరే
(॥॥)
సిగ్గువడ నేమిటికి చిత్తములోనివేడుక
యెగ్గుగాదు రమణుని కెరిఁగించవే
తగ్గించి దాఁచవచ్చునా తలఁపులోనివలవు
వొగ్గి యాకతానకు నీవు వొనరిక దీయవే
(॥॥)
ముసిముసినవ్వులేల ముంచిననీకోరికలు
వెస నాతడుఁ చెల్లించీ వేఁడుకొనవే
వసగాని చన్నులజవ్వన మొద్దంటేఁ బోవునా
కొసరి చూపుదుగాని కూడి తెరవేయవే
(॥॥)
సన్నలుఁ జాయలు నేల చలమున నీయాస
పన్ని యితఁ డీడేరిచీ విన్నవించవే
నిన్న నే తాఁ గూడినాఁడు నీవేల మొరఁగేవు
యెన్నిక శ్రీ వేంకటేశు నింకాఁ గాఁగిలించవే
(||pallavi||)
sĕlulamu māsedam̐ jĕppiṁcharādu
vĕlaya nādam̐ḍu nīvu visāriṁchugŏnare
(||||)
sigguvaḍa nemiḍigi sittamuloniveḍuga
yĕggugādu ramaṇuni kĕrim̐giṁchave
taggiṁchi dām̐savachchunā talam̐pulonivalavu
vŏggi yāgadānagu nīvu vŏnariga dīyave
(||||)
musimusinavvulela muṁchinanīgorigalu
vĕsa nādaḍum̐ sĕlliṁchī vem̐ḍugŏnave
vasagāni sannulajavvana mŏddaṁṭem̐ bovunā
kŏsari sūbudugāni kūḍi tĕraveyave
(||||)
sannalum̐ jāyalu nela salamuna nīyāsa
panni yidam̐ ḍīḍerisī vinnaviṁchave
ninna ne tām̐ gūḍinām̐ḍu nīvela mŏram̐gevu
yĕnniga śhrī veṁkaḍeśhu niṁkām̐ gām̐giliṁchave