Selulamu maa maamta seyavachchu nidivela

చెలులము మా మాఁట సేయవచ్చు నిదివేళ
Language

(॥పల్లవి॥)
చెలులము మా మాఁట సేయవచ్చు నిదివేళ
చెలఁగి యిదే నెపము చేసుకొనఁగదవే

(॥చెలు॥)
పలుమారుఁ బిలిచినాఁ బలుకవు పతితోడ
చలపాదితనమేలే సకియకును
అలిగినందుకు గుఱుతౌనిది మెచ్చితిమి
వల పిఁక నాఁపరాదు వల దియ్యకొనవే

(॥చెలు॥)
అంకెలఁ బెనఁగఁగాను ఆతనితో బిగిసేవు
మంకుఁదన మిదియేలే మగువకును
జంకించు వంచుకొన సందౌనిది నీకు మేలు
లంకె వాపరాదు యిఁక లలిఁ గాఁగిలించవే

(॥చెలు॥)
సేసవెట్టఁగా నవ్వేవు శ్రీవేంకటేశుతోను
బేసబెల్లితనమేలే ప్రియురాలికి
చేసినపొందుల కివి చెల్లు నే మెఱిఁగితిమి
వాసి గూడి మానరాదు వచ్చి మోవి ఇయ్యవే

(||pallavi||)
sĕlulamu mā mām̐ṭa seyavachchu nidiveḽa
sĕlam̐gi yide nĕbamu sesugŏnam̐gadave

(||sĕlu||)
palumārum̐ bilisinām̐ balugavu padidoḍa
salabādidanamele sagiyagunu
aliginaṁdugu guṟudaunidi mĕchchidimi
vala pim̐ka nām̐parādu vala diyyagŏnave

(||sĕlu||)
aṁkĕlam̐ bĕnam̐gam̐gānu ādanido bigisevu
maṁkum̐dana midiyele maguvagunu
jaṁkiṁchu vaṁchugŏna saṁdaunidi nīgu melu
laṁkĕ vābarādu yim̐ka lalim̐ gām̐giliṁchave

(||sĕlu||)
sesavĕṭṭam̐gā navvevu śhrīveṁkaḍeśhudonu
besabĕllidanamele priyurāligi
sesinabŏṁdula kivi sĕllu ne mĕṟim̐gidimi
vāsi gūḍi mānarādu vachchi movi iyyave