చెలులము మా కెప్పుడు సిగ్గె మేలు
(॥పల్లవి॥)
చెలులము మా కెప్పుడు సిగ్గె మేలు
సొలసి నిన్నుఁ గన్నులఁ జూచుటే మేలు
(॥చెలుల॥)
మంచిమాట లాడినాను మర్మములు సోఁకీ నిన్ను
యించుక గుట్టున నుండే దిదె మేలు
అంచెల నీ వాన తీఁగా అట్టె విని చొక్కుకొంటా
వుంచముతో సారె సారె నూఁకొనుటె మేలు
(॥చెలుల॥)
వూడిగాలు సేసినాను వోరసిన ట్లయ్యీని
వోడక కొలిచి నిలచుండుటె మేలు
వేడుక నీవు చేయి వేయఁగా బొగడుకంటా
వాడికెతోడ నీకుఁ గైవస మౌటె మేలు
(॥చెలుల॥)
చేయి పట్టి తీసితేను సేవలు గొన్న ట్టయ్యీని
చాయల నీదాన ననేసలిగె మేల
యీయెడ శ్రీవెంకటేశ యింతలో నన్నుఁ గూడితి
పాయక యిట్ల నుండేభాగ్యమె మేలు
(||pallavi||)
sĕlulamu mā kĕppuḍu siggĕ melu
sŏlasi ninnum̐ gannulam̐ jūsuḍe melu
(||sĕlula||)
maṁchimāḍa lāḍinānu marmamulu som̐kī ninnu
yiṁchuga guṭṭuna nuṁḍe didĕ melu
aṁchĕla nī vāna tīm̐gā aṭṭĕ vini sŏkkugŏṁṭā
vuṁchamudo sārĕ sārĕ nūm̐kŏnuḍĕ melu
(||sĕlula||)
vūḍigālu sesinānu vorasina ṭlayyīni
voḍaga kŏlisi nilasuṁḍuḍĕ melu
veḍuga nīvu seyi veyam̐gā bŏgaḍugaṁṭā
vāḍigĕdoḍa nīgum̐ gaivasa mauḍĕ melu
(||sĕlula||)
seyi paṭṭi tīsidenu sevalu gŏnna ṭṭayyīni
sāyala nīdāna nanesaligĕ mela
yīyĕḍa śhrīvĕṁkaḍeśha yiṁtalo nannum̐ gūḍidi
pāyaga yiṭla nuṁḍebhāgyamĕ melu