Selulamu maa keemaada seppagabodu

చెలులము మా కీమాట చెప్పకపోదు
Language

(॥పల్లవి॥)
చెలులము మా కీమాట చెప్పకపోదు
చెలఁగి ఆపె కోరిక చెల్లించవయ్యా

(॥చెలు॥)
మతకపునీలోనిమనసు దెలియలేక
సతి నన్ను రమ్మనఁగఁజాలదు గాని
తతి నిన్నుఁ బిలునఁగ తానే విచ్చేసినది
యితనై నకోరిక నీ వీడేరించవయ్యా

(॥చెలు॥)
కడురాజసపు నిన్నుఁ గమ్మి వేగిరించలేక
వొడిసి కొంగువట్టిక వున్నది గాని
అడరి విందుచెప్పఁగ నాయతపడి వున్నది
కడలేని వేడుకతో కానిమ్మనవయ్యా

(॥చెలు॥)
మించినజాణవు నిన్ను మితీమీఱఁగాలేక
ముంచిన మొగము చూచి మొక్కీఁగాని
అంచెల శ్రీవేంకటేశ అట్టె నిన్నుఁ గూడున్నది
చంచుల నీలాగులనే చనవియ్యవయ్యా

(||pallavi||)
sĕlulamu mā kīmāḍa sĕppagabodu
sĕlam̐gi ābĕ koriga sĕlliṁchavayyā

(||sĕlu||)
madagabunīlonimanasu dĕliyalega
sadi nannu rammanam̐gam̐jāladu gāni
tadi ninnum̐ bilunam̐ga tāne vichchesinadi
yidanai nagoriga nī vīḍeriṁchavayyā

(||sĕlu||)
kaḍurājasabu ninnum̐ gammi vegiriṁchalega
vŏḍisi kŏṁguvaṭṭiga vunnadi gāni
aḍari viṁdusĕppam̐ga nāyadabaḍi vunnadi
kaḍaleni veḍugado kānimmanavayyā

(||sĕlu||)
miṁchinajāṇavu ninnu midīmīṟam̐gālega
muṁchina mŏgamu sūsi mŏkkīm̐gāni
aṁchĕla śhrīveṁkaḍeśha aṭṭĕ ninnum̐ gūḍunnadi
saṁchula nīlāgulane sanaviyyavayyā