చెలులము కన్నమాఁట చెప్పితి మింతే
(॥పల్లవి॥)
చెలులము కన్నమాఁట చెప్పితి మింతే
నెలకొన్న నీ చిత్తము నీకే తెలుసును
(॥చెలు॥)
సేసుకొన్నదేవులు సేవ నీకుఁ జేసీ నిదే
ఆస నీ కెక్కడ నుందో అదే రంగము
సేసవెట్టెతమకానఁ జెలికిఁ బయ్యద జారీ
నీసూటి యెందున్నదో నీకె తెలుసు
(॥చెలు॥)
యిక్కువైనయిల్లాలు యెదుటనే నీకున్నది
అక్కర నీ కెందున్నదో అదే రంగము
తొక్కులాడేవే డుకను తొయ్యలి మేను సోఁకి
నెకొన్ననీ పియ మేదో నీకే తెలుసు
(॥చెలు॥)
పాయపుపట్టపురాణి పానుపుపైనే వున్నది
ఆయ మెందు ముట్టునో అదే రంగము
చేయివేసేరసాన సిగ్గుల నవ్వులు రేఁగీ
నీయిచ్చ శ్రీవేంకటేశ నీకే తెలును
(||pallavi||)
sĕlulamu kannamām̐ṭa sĕppidi miṁte
nĕlagŏnna nī sittamu nīge tĕlusunu
(||sĕlu||)
sesugŏnnadevulu seva nīgum̐ jesī nide
āsa nī kĕkkaḍa nuṁdo ade raṁgamu
sesavĕṭṭĕdamagānam̐ jĕligim̐ bayyada jārī
nīsūḍi yĕṁdunnado nīgĕ tĕlusu
(||sĕlu||)
yikkuvainayillālu yĕduḍane nīgunnadi
akkara nī kĕṁdunnado ade raṁgamu
tŏkkulāḍeve ḍuganu tŏyyali menu som̐ki
nĕgŏnnanī piya medo nīge tĕlusu
(||sĕlu||)
pāyabubaṭṭaburāṇi pānububaine vunnadi
āya mĕṁdu muṭṭuno ade raṁgamu
seyiveserasāna siggula navvulu rem̐gī
nīyichcha śhrīveṁkaḍeśha nīge tĕlunu