చెలులలో నేను చేసిన భాగ్య మెట్టిదో
(॥పల్లవి॥)
చెలులలో నేను చేసిన భాగ్య మెట్టిదో
వెలలేని వేడుకలు విభుఁడే యెఱుఁగునే
(॥॥)
అందరికి మోహించిన అట్టే వుండుఁగాని యాతఁ
డందులో నాపై బత్తియై యుండుఁదాను
యిందరితో మాటలు తా నెన్నేసి ఆడినాను
కందువ నాతోనే ఆ కత లెల్లాఁ జెప్పునే
(॥॥)
కొలువులో కాంతలఁ బైకొని కనుఁగొను గాని
తలఁపులో నన్నే చూచుఁదా నితఁడు
సెలవులఁ గొందరితో చేకొని నవ్వినాను
చలువల నాతోను సన్నలనే నవ్వునే
(॥॥)
అచ్చలాన నెవ్వరిపై నైనాఁ జేయి వేసుఁగాని
కచ్చుపెట్టి నన్నే రతిఁ గౌఁగిలించునే
యిచ్చల శ్రీ వేంకటేశుఁడే నలమేలు మంగను
మచ్చిక నాపైఁ గలఁడు మన్నించునే నన్నును.
(||pallavi||)
sĕlulalo nenu sesina bhāgya mĕṭṭido
vĕlaleni veḍugalu vibhum̐ḍe yĕṟum̐gune
(||||)
aṁdarigi mohiṁchina aṭṭe vuṁḍum̐gāni yādam̐
ḍaṁdulo nābai battiyai yuṁḍum̐dānu
yiṁdarido māḍalu tā nĕnnesi āḍinānu
kaṁduva nādone ā kada lĕllām̐ jĕppune
(||||)
kŏluvulo kāṁtalam̐ baigŏni kanum̐gŏnu gāni
talam̐pulo nanne sūsum̐dā nidam̐ḍu
sĕlavulam̐ gŏṁdarido segŏni navvinānu
saluvala nādonu sannalane navvune
(||||)
achchalāna nĕvvaribai nainām̐ jeyi vesum̐gāni
kachchubĕṭṭi nanne radim̐ gaum̐giliṁchune
yichchala śhrī veṁkaḍeśhum̐ḍe nalamelu maṁganu
machchiga nābaim̐ galam̐ḍu manniṁchune nannunu.