చెలులకునుఁ బతులకును సేయఁగల పను లివియ
(॥పల్లవి॥)
చెలులకునుఁ బతులకును సేయఁగల పను లివియ
నెలకొన్న పొందికలు నెరపవలె సకియా
(॥చెలు॥)
వలవఁగా వలవఁగా వాడికలు కడుఁ బుట్టు
తలఁచఁగాఁ దలఁచఁగా తమి రేఁగును
పిలువఁగాఁ బిలువఁగాఁ బ్రేయంబు లీడేరు
సొలయఁగా సొలయఁగా సొరిది మది గరఁగు
(॥చెలు॥)
చెనకఁగా జెనకఁగా జెలరేఁగు వేడుకలు
యెనయఁగా నెనయఁగా నింపు గలుగు
పెనఁగఁగాఁ బెనఁగఁగాఁ బెరుగు జవ్వనమదము
తనియఁగాఁ దనియఁగాఁ దగులు నివ్వెరగు
(॥చెలు॥)
వొరయఁగా నొరయఁగా నుప్పతిలు సరసంబు
మరుగఁగా మరుగఁగా మలయు సుఖము
యిరవైన శ్రీవేంకటేశ్వురుఁడు నిను నేలె
పెరుగఁగాఁ బెరుగఁగా ప్రియురాలవైతివి
(||pallavi||)
sĕlulagunum̐ badulagunu seyam̐gala panu liviya
nĕlagŏnna pŏṁdigalu nĕrabavalĕ sagiyā
(||sĕlu||)
valavam̐gā valavam̐gā vāḍigalu kaḍum̐ buṭṭu
talam̐sam̐gām̐ dalam̐sam̐gā tami rem̐gunu
piluvam̐gām̐ biluvam̐gām̐ breyaṁbu līḍeru
sŏlayam̐gā sŏlayam̐gā sŏridi madi garam̐gu
(||sĕlu||)
sĕnagam̐gā jĕnagam̐gā jĕlarem̐gu veḍugalu
yĕnayam̐gā nĕnayam̐gā niṁpu galugu
pĕnam̐gam̐gām̐ bĕnam̐gam̐gām̐ bĕrugu javvanamadamu
taniyam̐gām̐ daniyam̐gām̐ dagulu nivvĕragu
(||sĕlu||)
vŏrayam̐gā nŏrayam̐gā nuppadilu sarasaṁbu
marugam̐gā marugam̐gā malayu sukhamu
yiravaina śhrīveṁkaḍeśhvurum̐ḍu ninu nelĕ
pĕrugam̐gām̐ bĕrugam̐gā priyurālavaidivi