Selulado nee suddulu seppa vachchunaa

చెలులతో నీ సుద్దులు చెప్ప వచ్చునా
Language

(॥పల్లవి॥)
చెలులతో నీ సుద్దులు చెప్ప వచ్చునా
చలము మన లోలొనె సాదించుట గాకా

(॥చెలులతో॥)
మచ్చిక నీతిట్లూను మనలోని వొట్లూను
చెచ్చెర నొరులతోడఁ జెప్ప వచ్చునా
కొచ్చి బొమ్మల జంకించి కోపముల నుంకించి
రొచ్చుల మతికాఁక దీరుచుకొంట గాకా

(॥చెలులతో॥)
నీ చేఁతలను మన నెట్టుకొన్న మర్మములు
చేచేత నొరులతోడఁ జెప్ప వచ్చునా
తాచి నిట్టూర్పు నెరపి తగఁ గన్నులు గిరపి
యేచి మనలో మనమే యిందుకొంట గాకా

(॥చెలులతో॥)
యింతేసి నీ వినయాలు యిక్కువ మనరతులు
చెంతల నొకరితోడఁ జెప్ప వచ్చునా
పంతపు శ్రీవెంకటేశ భావములనే చొక్కి
వింత సంతసాల విఱ్ఱవీఁగుకొంట గాకా

(||pallavi||)
sĕlulado nī suddulu sĕppa vachchunā
salamu mana lolŏnĕ sādiṁchuḍa gāgā

(||sĕlulado||)
machchiga nīdiṭlūnu manaloni vŏṭlūnu
sĕchchĕra nŏruladoḍam̐ jĕppa vachchunā
kŏchchi bŏmmala jaṁkiṁchi kobamula nuṁkiṁchi
rŏchchula madigām̐ka dīrusugŏṁṭa gāgā

(||sĕlulado||)
nī sem̐talanu mana nĕṭṭugŏnna marmamulu
seseda nŏruladoḍam̐ jĕppa vachchunā
tāsi niṭṭūrbu nĕrabi tagam̐ gannulu girabi
yesi manalo maname yiṁdugŏṁṭa gāgā

(||sĕlulado||)
yiṁtesi nī vinayālu yikkuva manaradulu
sĕṁtala nŏgaridoḍam̐ jĕppa vachchunā
paṁtabu śhrīvĕṁkaḍeśha bhāvamulane sŏkki
viṁta saṁtasāla viṭravīm̐gugŏṁṭa gāgā