Selulaala yimkam dana sittamu naa bhaagyamu

చెలులాల యిఁకఁ దన చిత్తము నా భాగ్యము
Language

(॥పల్లవి॥)
చెలులాల యిఁకఁ దన చిత్తము నా భాగ్యము
తలఁచిన తలఁపెల్లాఁ దానే యెఱుఁగునే

(॥॥)
విన్నవించ కుండరాదు విరహానఁ బడరాదు
యెన్నికలు విభునికి నెట్టుండునో
మన్నించినాఁడు తాను మరిగితి నింత నేను
యిన్నేసి సుద్దులు మీకు నేమి చెప్పెనే

(॥॥)
చేయివట్ట కుండరాదు సిగ్గులు వడఁగరాదు
ఆ యెడ నేమనునో ఆతఁడు నేఁడు
చాయ చూపినాఁడు తాను సన్న యెఱిఁగితి నేను
మీ యంత నా భావములు మీరే చూచుకోరే

(॥॥)
అలమ కుండఁగరాదు ఆసలు మానుపరాదు
యిల శ్రీ వేంకటేశ్వరు ఇత వేదో
కలసినాఁడు తాను కైవస మైతి నేను
తెలుకోరే ఇఁకఁ దేటతెల్లమిగను

(||pallavi||)
sĕlulāla yim̐kam̐ dana sittamu nā bhāgyamu
talam̐sina talam̐pĕllām̐ dāne yĕṟum̐gune

(||||)
vinnaviṁcha kuṁḍarādu virahānam̐ baḍarādu
yĕnnigalu vibhunigi nĕṭṭuṁḍuno
manniṁchinām̐ḍu tānu marigidi niṁta nenu
yinnesi suddulu mīgu nemi sĕppĕne

(||||)
seyivaṭṭa kuṁḍarādu siggulu vaḍam̐garādu
ā yĕḍa nemanuno ādam̐ḍu nem̐ḍu
sāya sūbinām̐ḍu tānu sanna yĕṟim̐gidi nenu
mī yaṁta nā bhāvamulu mīre sūsugore

(||||)
alama kuṁḍam̐garādu āsalu mānubarādu
yila śhrī veṁkaḍeśhvaru ida vedo
kalasinām̐ḍu tānu kaivasa maidi nenu
tĕlugore im̐kam̐ deḍadĕllamiganu