చెలులాల యిఁక మీకుఁ జెప్పే దేమే
(॥పల్లవి॥)
చెలులాల యిఁక మీకుఁ జెప్పే దేమే
తలపోఁతలకు నెల్ల వలపే మూలమే
(॥॥)
కన్నులఁ జూచిన చూపు కాంక్షలకు మూలము
సన్నలు సరసాన రేఁచఁగ మూలము
విన్న వినుకులు కడు విరహానకు మూలము
విన్నపములకు నెల్ల విభుఁడే మూలము
(॥॥)
సంతోషముల కెల్ల జవ్వనమే మూలము
చింతల కెల్లాఁ జెక్కు చేయి మూలము
చెంతనున్న సిగ్గులకు చిరునవ్వులే మూలము
మంతనపు కోరికెకు మనసే మూలమే
(॥॥)
పెనఁగులాటలకును ప్రియములే మూలము
ననుపులకుఁ బాయని నంటు మూలము
యెనసి శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
తనివోని రతులకు తమకమే మూలమే
(||pallavi||)
sĕlulāla yim̐ka mīgum̐ jĕppe deme
talabom̐talagu nĕlla valabe mūlame
(||||)
kannulam̐ jūsina sūbu kāṁkṣhalagu mūlamu
sannalu sarasāna rem̐sam̐ga mūlamu
vinna vinugulu kaḍu virahānagu mūlamu
vinnabamulagu nĕlla vibhum̐ḍe mūlamu
(||||)
saṁtoṣhamula kĕlla javvaname mūlamu
siṁtala kĕllām̐ jĕkku seyi mūlamu
sĕṁtanunna siggulagu sirunavvule mūlamu
maṁtanabu korigĕgu manase mūlame
(||||)
pĕnam̐gulāḍalagunu priyamule mūlamu
nanubulagum̐ bāyani naṁṭu mūlamu
yĕnasi śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
tanivoni radulagu tamagame mūlame