చెలులాల యిందుకే సిగ్గయ్యీ నాకు
(॥పల్లవి॥)
చెలులాల యిందుకే సిగ్గయ్యీ నాకు
తలకొన్న నా గుణము దాఁచ నేలే యిపుడూ
(॥॥)
అతఁడు చేసిన మేలు ఆడుకొన వేడుకౌను
యితర సతులు విని యే మందురో
తతితో వాని గుణాలు తలఁచితే వెరగౌను
మితిమీరి సవతులు మించెట్టు నవ్వుదురో
(॥॥)
చిమ్ముల నా రమణుని చేఁతలు నేఁ జూచుకొందు
కిమ్ముల వనిత లెంత గేలి సేతురో
నమ్మి వానిఁ బేరుకొని నాలోనెఁ జొక్కుకొందు
కొమ్మలు మోమోము లెట్టు కోరి చూచుకొందురో
(॥॥)
గక్కన శ్రీ వేంకటేశుఁ గంటేఁ గౌఁగిలించుకొందు
పక్కనున్నవా రెంత పచ్చిసేతురో
ఇక్కువఁ దా నన్నుఁ గూడె యే నలమేలుమంగను
మొక్కుదు నందు కిందరు ముంచి యెట్టు మెత్తురో
(||pallavi||)
sĕlulāla yiṁduge siggayyī nāgu
talagŏnna nā guṇamu dām̐sa nele yibuḍū
(||||)
adam̐ḍu sesina melu āḍugŏna veḍugaunu
yidara sadulu vini ye maṁduro
tadido vāni guṇālu talam̐side vĕragaunu
midimīri savadulu miṁchĕṭṭu navvuduro
(||||)
simmula nā ramaṇuni sem̐talu nem̐ jūsugŏṁdu
kimmula vanida lĕṁta geli seduro
nammi vānim̐ berugŏni nālonĕm̐ jŏkkugŏṁdu
kŏmmalu momomu lĕṭṭu kori sūsugŏṁduro
(||||)
gakkana śhrī veṁkaḍeśhum̐ gaṁṭem̐ gaum̐giliṁchugŏṁdu
pakkanunnavā rĕṁta pachchiseduro
ikkuvam̐ dā nannum̐ gūḍĕ ye nalamelumaṁganu
mŏkkudu naṁdu kiṁdaru muṁchi yĕṭṭu mĕtturo