చెలులాల యిటువంటి చెలి నలయించకురే
(॥పల్లవి॥)
చెలులాల యిటువంటి చెలి నలయించకురే
చలిమందు లివి మీ చాయలకు వచ్చునా
(॥చెలు॥)
వెలినున్న రమణుని వేగుమే తెచ్చితేఁ గాక
కలువలఁ గప్పితేను కాఁక దీరీనా
పిలిచి యిద్దరిఁ బెండ్లిపీఁటపైఁ బెట్టితేఁ గాక
వలరాచపౌజులతో వాదించవసమా
(॥చెలు॥)
మనసు లోపలివాని మచ్చిక సేసితేఁ గాక
తనువుపై గందమునఁ దాప మారీనా
చెనకించి యొండొరుల సేన వెట్టించితేఁ గాక
మొనసినవలపులు మూసిపెట్ట వచ్చునా
(॥చెలు॥)
కాంతకు శ్రీవేంకటేశుఁ గాఁగిటఁ బెట్టితేఁ గాక
యెంత కప్ర మిచ్చినాను యితవయ్యీనా
యింతలో దయదలఁచి యీతఁడే విచ్చేసి కూడె
పొంతనె యీవేడుకలు పొగడఁగఁ గలమా
(||pallavi||)
sĕlulāla yiḍuvaṁṭi sĕli nalayiṁchagure
salimaṁdu livi mī sāyalagu vachchunā
(||sĕlu||)
vĕlinunna ramaṇuni vegume tĕchchidem̐ gāga
kaluvalam̐ gappidenu kām̐ka dīrīnā
pilisi yiddarim̐ bĕṁḍlibīm̐ṭabaim̐ bĕṭṭidem̐ gāga
valarāsabaujulado vādiṁchavasamā
(||sĕlu||)
manasu lobalivāni machchiga sesidem̐ gāga
tanuvubai gaṁdamunam̐ dāba mārīnā
sĕnagiṁchi yŏṁḍŏrula sena vĕṭṭiṁchidem̐ gāga
mŏnasinavalabulu mūsibĕṭṭa vachchunā
(||sĕlu||)
kāṁtagu śhrīveṁkaḍeśhum̐ gām̐giḍam̐ bĕṭṭidem̐ gāga
yĕṁta kapra michchinānu yidavayyīnā
yiṁtalo dayadalam̐si yīdam̐ḍe vichchesi kūḍĕ
pŏṁtanĕ yīveḍugalu pŏgaḍam̐gam̐ galamā