Selulaala yidevo nem jesinadi bhaagyamu

చెలులాల యిదెవో నేఁ జేసినది భాగ్యము
Language

(॥పల్లవి॥)
చెలులాల యిదెవో నేఁ జేసినది భాగ్యము
కలిగెఁ దన కరుణ కడమ లింకేఁటివే

(॥॥)
మన్నించి తానే నాపై మచ్చిక గలిగుండఁ గా
విన్నప మేమి సేసే నీ వేగినంతాను
కన్నులెదుటను తాను కైవసమై మెలఁ గీని
సన్న లిఁ క నేఁ టికి సారె సారెకు

(॥॥)
కోరినట్లల్లా దానే కొమ్మని యొసగఁ గాను
చేరి వేడుకొనే దేమే చేతులు చాఁ చి
యీ రీతి నావాఁ డై తా నా యింట నిట్టే వుండఁ గాను
కూరిమి గొసరే దేమే కొచ్చి కొచ్చి యిపుడూ

(॥॥)
కందువ లంటి తానే కౌఁ గిలించి కూఁ డఁ గాను
అంది యాసపడే దేమే అప్పటి నేను
శ్రీ వేంకటేశుఁ డే నలమేలు మంగను
మెచ్చే దేమే మాటిమాటికి.

(||pallavi||)
sĕlulāla yidĕvo nem̐ jesinadi bhāgyamu
kaligĕm̐ dana karuṇa kaḍama liṁkem̐ṭive

(||||)
manniṁchi tāne nābai machchiga galiguṁḍam̐ gā
vinnaba memi sese nī veginaṁtānu
kannulĕduḍanu tānu kaivasamai mĕlam̐ gīni
sanna lim̐ ka nem̐ ṭigi sārĕ sārĕgu

(||||)
korinaṭlallā dāne kŏmmani yŏsagam̐ gānu
seri veḍugŏne deme sedulu sām̐ si
yī rīdi nāvām̐ ḍai tā nā yiṁṭa niṭṭe vuṁḍam̐ gānu
kūrimi gŏsare deme kŏchchi kŏchchi yibuḍū

(||||)
kaṁduva laṁṭi tāne kaum̐ giliṁchi kūm̐ ḍam̐ gānu
aṁdi yāsabaḍe deme appaḍi nenu
śhrī veṁkaḍeśhum̐ ḍe nalamelu maṁganu
mĕchche deme māḍimāḍigi.