Selulaala yettido yee selivalabu

చెలులాల యెట్టిదో యీ చెలివలపు
Language

(॥పల్లవి॥)
చెలులాల యెట్టిదో యీ చెలివలపు
మొలకల పులకలు వెూఁపులాయ మేనను

(॥॥)
మొగమెల్లఁ గన్నులై ముంచుకొనెఁ జూడరే
వెగటుగఁ బతిఁ జూచేవేడుకలను
నగవెల్లాఁ గప్పురాలై నలుగడఁ జిందెనదే
పగటుల నీకెదిక్కు భావించగదరే

(॥॥)
నిలువెల్లాఁ గళలై నిండుకొనెఁ జూడరే
లలి నాతఁడిచ్చిన తమ్ములమువల్ల
పలుకులెల్లాఁ దేనెలై పై పైఁ గురిసీ నదే
నెలఁ త యెంతనేరిచె నెట్టుకొని వినరే

(॥॥)
వురమెల్లఁ జన్నులై వుదుటెక్కెఁ జూడరే
పొరి శ్రీ వేంకటేశుఁ బొందినందున
సరులెల్లా గుంపుగట్టె సారె నలమేల్మంగకు
సురతచిన్నలు మించెఁ జొక్కిచొక్కి మెచ్చరే

(||pallavi||)
sĕlulāla yĕṭṭido yī sĕlivalabu
mŏlagala pulagalu vĕూm̐pulāya menanu

(||||)
mŏgamĕllam̐ gannulai muṁchugŏnĕm̐ jūḍare
vĕgaḍugam̐ badim̐ jūseveḍugalanu
nagavĕllām̐ gappurālai nalugaḍam̐ jiṁdĕnade
pagaḍula nīgĕdikku bhāviṁchagadare

(||||)
niluvĕllām̐ gaḽalai niṁḍugŏnĕm̐ jūḍare
lali nādam̐ḍichchina tammulamuvalla
palugulĕllām̐ denĕlai pai paim̐ gurisī nade
nĕlam̐ ta yĕṁtanerisĕ nĕṭṭugŏni vinare

(||||)
vuramĕllam̐ jannulai vuduḍĕkkĕm̐ jūḍare
pŏri śhrī veṁkaḍeśhum̐ bŏṁdinaṁduna
sarulĕllā guṁpugaṭṭĕ sārĕ nalamelmaṁgagu
suradasinnalu miṁchĕm̐ jŏkkisŏkki mĕchchare