చెలులాల యేమని చెప్పుదునే యీ సుద్దులు
(॥పల్లవి॥)
చెలులాల యేమని చెప్పుదునే యీ సుద్దులు
అలరి యెంత పెద్దరిక మందురంటాఁ గాని
(॥చెలు॥)
మరిగినట్టె యాపెతో మాటలాడీఁగాని
కరుణ నాపై నున్నది కాంతునికి
సిరులతోఁ గొలువులు సేయించుకొనీఁగాని
సొరిదిఁ బతి కున్నవి చూపులు నామీఁదనే
(॥చెలు॥)
బలిమి నందరివిన్నపములు వినీఁగాని
తలఁపు నామీఁదనే యాతని కున్నది
అలరి నాటకసాలయాటలు చూచుఁగాని
నెలకొన్నకోరికలు నెట్టన నాయందునే
(॥చెలు॥)
పెక్కు సతుల నూరకె పెండ్లాడుఁగాని తాను
అక్కర నామీఁదనే యాతనికిని
చొక్కి శ్రీవేంకటేశుఁ డెచ్చోటనైనా నుండుఁగాని
యిక్కడ వచ్చి నన్నేలె యిరవు మాయింటనే
(||pallavi||)
sĕlulāla yemani sĕppudune yī suddulu
alari yĕṁta pĕddariga maṁduraṁṭām̐ gāni
(||sĕlu||)
mariginaṭṭĕ yābĕdo māḍalāḍīm̐gāni
karuṇa nābai nunnadi kāṁtunigi
siruladom̐ gŏluvulu seyiṁchugŏnīm̐gāni
sŏridim̐ badi kunnavi sūbulu nāmīm̐dane
(||sĕlu||)
balimi naṁdarivinnabamulu vinīm̐gāni
talam̐pu nāmīm̐dane yādani kunnadi
alari nāḍagasālayāḍalu sūsum̐gāni
nĕlagŏnnagorigalu nĕṭṭana nāyaṁdune
(||sĕlu||)
pĕkku sadula nūragĕ pĕṁḍlāḍum̐gāni tānu
akkara nāmīm̐dane yādanigini
sŏkki śhrīveṁkaḍeśhum̐ ḍĕchchoḍanainā nuṁḍum̐gāni
yikkaḍa vachchi nannelĕ yiravu māyiṁṭane