చెలులాల యేమని చెప్పెనో తాను
(॥పల్లవి॥)
చెలులాల యేమని చెప్పెనో తాను
యెలమితో వివరించి యీతని నడుగరే
(॥చెలు॥)
చెక్కులవెంటఁగారీఁ జెమటలూ
వెక్కసపుంగొప్పువెంట విరులు రాలీ
చెక్కుకొంటాఁ దనదట్టీచెఱఁగు జీరాడఁగా
యెక్కడనుండి వచ్చీని యీతని నడుగరే
(॥చెలు॥)
అంగమునఁ దొట్టుపడీ నలపులూ
వుంగిటిగొనీ ముక్కున నుసురులు
సింగారపువింతాలెల్లా చెలఁగఁగా
యెంగిలై యెందుండి వచ్చీ నీతని నడుగరే
(॥చెలు॥)
గిఱికొనీ మోవిమీఁద కెంపులూ
మెఱసీ నురాన నలమేలుమంగా
తఱి శ్రీవేంకటేశుఁడు తానె మమ్మెల్లా నేలె
యెఱఁగ మెందుండి వచ్చీ నీతని నడుగరే
(||pallavi||)
sĕlulāla yemani sĕppĕno tānu
yĕlamido vivariṁchi yīdani naḍugare
(||sĕlu||)
sĕkkulavĕṁṭam̐gārīm̐ jĕmaḍalū
vĕkkasabuṁgŏppuvĕṁṭa virulu rālī
sĕkkugŏṁṭām̐ danadaṭṭīsĕṟam̐gu jīrāḍam̐gā
yĕkkaḍanuṁḍi vachchīni yīdani naḍugare
(||sĕlu||)
aṁgamunam̐ dŏṭṭubaḍī nalabulū
vuṁgiḍigŏnī mukkuna nusurulu
siṁgārabuviṁtālĕllā sĕlam̐gam̐gā
yĕṁgilai yĕṁduṁḍi vachchī nīdani naḍugare
(||sĕlu||)
giṟigŏnī movimīm̐da kĕṁpulū
mĕṟasī nurāna nalamelumaṁgā
taṟi śhrīveṁkaḍeśhum̐ḍu tānĕ mammĕllā nelĕ
yĕṟam̐ga mĕṁduṁḍi vachchī nīdani naḍugare