Selulaala yeeselim gaasugonusu

చెలులాల యీచెలిఁ గాచుకొనుచు
Language

(॥పల్లవి॥)
చెలులాల యీచెలిఁ గాచుకొనుచు
సెలవున నెప్పుడు నే నుండేను

(॥చెలు॥)
తప్పక చూచిన తానే తెలుసును
చెప్పకతొల్లే చేరి వలపు
ముప్పిరి నాతనిముందర నిలువదె
యిప్పుడే యీడకు నేతెంచీని

(॥చెలు॥)
యింతిఁ బేర్కొనిన యిటు దయదలఁచును
అంత బలిమిసేయఁగ వలదు
కాంతలు చేయెత్తి గక్కన మొక్కరే
మంతనమిచ్చీ మనసతి కిపుడు

(॥చెలు॥)
కానికిచ్చితేఁ గలసీ నీకేను
నానెను మనవిన్నప మపుడే
ఆనుక శ్రీవేంకటాధిపు నగరే
యీనెలఁత గలసె నిదివో నేఁడు

(||pallavi||)
sĕlulāla yīsĕlim̐ gāsugŏnusu
sĕlavuna nĕppuḍu ne nuṁḍenu

(||sĕlu||)
tappaga sūsina tāne tĕlusunu
sĕppagadŏlle seri valabu
muppiri nādanimuṁdara niluvadĕ
yippuḍe yīḍagu nedĕṁchīni

(||sĕlu||)
yiṁtim̐ bergŏnina yiḍu dayadalam̐sunu
aṁta balimiseyam̐ga valadu
kāṁtalu seyĕtti gakkana mŏkkare
maṁtanamichchī manasadi kibuḍu

(||sĕlu||)
kānigichchidem̐ galasī nīgenu
nānĕnu manavinnaba mabuḍe
ānuga śhrīveṁkaḍādhibu nagare
yīnĕlam̐ta galasĕ nidivo nem̐ḍu