చెలులాల యీమాఁట చెప్పఁగదరే । నే
(॥పల్లవి॥)
చెలులాల యీమాఁట చెప్పఁగదరే । నే-
నలసితే తా సొలసీ నది యేఁటిదే
(॥చెలు॥)
చేతుల మొక్కితి నేను చెంగావిచూపులు చూచె
యీతల నాతల నాకు నేది దగవే
యేతుల నేఁ బలికితే నింతలోనె నవ్వెఁ దాను
నీతి విచారించి మాఁట నిలుపరే
(॥చెలు॥)
వూరకే నే నుసురంటే నొరగి తాఁ జెమరించె
యీరీతి మాలో నికేది దగవే
కోరి నేఁ గొప్పువట్టితే కొంగువట్టీ నింతలోనె
నేదమేది యీమాఁట నిలుపరే
(॥చెలు॥)
అంగము నేమఱచితే నంతలోనే నన్నుఁ గూడె
యింగితాన నిద్దరికి నేది దగవే
సంగతి శ్రీవేంకటేశు సమరతిఁ గూడితిని
నింగిమోవ సంతసము నిలుపరే
(||pallavi||)
sĕlulāla yīmām̐ṭa sĕppam̐gadare | ne-
nalaside tā sŏlasī nadi yem̐ṭide
(||sĕlu||)
sedula mŏkkidi nenu sĕṁgāvisūbulu sūsĕ
yīdala nādala nāgu nedi dagave
yedula nem̐ baligide niṁtalonĕ navvĕm̐ dānu
nīdi visāriṁchi mām̐ṭa nilubare
(||sĕlu||)
vūrage ne nusuraṁṭe nŏragi tām̐ jĕmariṁchĕ
yīrīdi mālo nigedi dagave
kori nem̐ gŏppuvaṭṭide kŏṁguvaṭṭī niṁtalonĕ
nedamedi yīmām̐ṭa nilubare
(||sĕlu||)
aṁgamu nemaṟaside naṁtalone nannum̐ gūḍĕ
yiṁgidāna niddarigi nedi dagave
saṁgadi śhrīveṁkaḍeśhu samaradim̐ gūḍidini
niṁgimova saṁtasamu nilubare