చెలులాల యీ మేలు చెలువుఁడే చూచుఁగాని
(॥పల్లవి॥)
చెలులాల యీ మేలు చెలువుఁడే చూచుఁగాని
యెలమి తోడుత మొక్కి యెరిఁగించరే
(॥చెలు॥)
వనితజవ్వనపవసంతకాలములోనే
వెనుకొని విరపువేసవి మించె
ననిచెఁ బెంజెమట వానకాలము నంతలోనె
వినయముతోఁ బతికి విన్నవించరే
(॥చెలు॥)
కాంతపులకల శరత్కాలము నదె తోఁచె
చింతలమంచులతో హేమంతము ముంచె
చెంతఁ గోర్కు లెన్నులెత్తి శిశిరవేళ యేతెంచె
యింతకు నీకెవిభుని నీడకుఁ దోడితేరె
(॥చెలు॥)
చెలియకుఁ గొప్పు వీడె చీఁకటికాలము నందె
నెలకొనె సిగ్గుల వెన్నెలకాలము
అలమె శ్రీ వేంకటేశుఁడంతలోనె తానె వచ్చి
పిలిచి సారెకు నిట్టె ప్రేమరేఁచరే
(||pallavi||)
sĕlulāla yī melu sĕluvum̐ḍe sūsum̐gāni
yĕlami toḍuda mŏkki yĕrim̐giṁchare
(||sĕlu||)
vanidajavvanabavasaṁtagālamulone
vĕnugŏni virabuvesavi miṁchĕ
nanisĕm̐ bĕṁjĕmaḍa vānagālamu naṁtalonĕ
vinayamudom̐ badigi vinnaviṁchare
(||sĕlu||)
kāṁtabulagala śharatkālamu nadĕ tom̐sĕ
siṁtalamaṁchulado hemaṁtamu muṁchĕ
sĕṁtam̐ gorgu lĕnnulĕtti śhiśhiraveḽa yedĕṁchĕ
yiṁtagu nīgĕvibhuni nīḍagum̐ doḍiderĕ
(||sĕlu||)
sĕliyagum̐ gŏppu vīḍĕ sīm̐kaḍigālamu naṁdĕ
nĕlagŏnĕ siggula vĕnnĕlagālamu
alamĕ śhrī veṁkaḍeśhum̐ḍaṁtalonĕ tānĕ vachchi
pilisi sārĕgu niṭṭĕ premarem̐sare