చెలులాల యీ కన్నెకుఁ జెప్పరే బుద్ధి
(॥పల్లవి॥)
చెలులాల యీ కన్నెకుఁ జెప్పరే బుద్ధి
చెలఁగి పయ్యద మాఁటు సేయ నేలే తానూ
(॥॥)
పెంచి యిద్దరము బొమ్మ పెండ్లిండ్లు సేత మంటే
కొంచి నాతో తానేల సిగ్గులు వడీనే
పొంచి నా చేతికి పెద్ద పూజెకుండ లిమ్మంటేను
వంచనతో నిట్టే యాల వంచీనే శిరసు
(॥॥)
ననిచే నేఁ డే పెండ్లీ నాగవల్లి సేత మంటే
యెన లేని తలపోఁత నేల నవ్వీనే
తనియ కిట్టే కంకణదారాలు గట్టుద మంటే
పెనఁగుచు నిప్పు డెంత బిగిసీనే యీకె
(॥॥)
కూడ మంచివేళ కొంగులు ముళ్ళు వేత మంటే
జాడతో బొమ్మల నేల జంకించీనే
యీడై శ్రీ వేంకటేశుఁడీపె మాటలు నే నాడఁగా
జో డాయ సోబన మేమి చూచీనే నన్నును
(||pallavi||)
sĕlulāla yī kannĕgum̐ jĕppare buddhi
sĕlam̐gi payyada mām̐ṭu seya nele tānū
(||||)
pĕṁchi yiddaramu bŏmma pĕṁḍliṁḍlu seda maṁṭe
kŏṁchi nādo tānela siggulu vaḍīne
pŏṁchi nā sedigi pĕdda pūjĕguṁḍa limmaṁṭenu
vaṁchanado niṭṭe yāla vaṁchīne śhirasu
(||||)
nanise nem̐ ḍe pĕṁḍlī nāgavalli seda maṁṭe
yĕna leni talabom̐ta nela navvīne
taniya kiṭṭe kaṁkaṇadārālu gaṭṭuda maṁṭe
pĕnam̐gusu nippu ḍĕṁta bigisīne yīgĕ
(||||)
kūḍa maṁchiveḽa kŏṁgulu muḽḽu veda maṁṭe
jāḍado bŏmmala nela jaṁkiṁchīne
yīḍai śhrī veṁkaḍeśhum̐ḍībĕ māḍalu ne nāḍam̐gā
jo ḍāya sobana memi sūsīne nannunu