Selulaala voohimchi sepparamma

చెలులాల వూహించి చెప్పరమ్మ
Language

(॥పల్లవి॥)
చెలులాల వూహించి చెప్పరమ్మ
నిలువెల్ల మురిపెమే నిండకుండీనా

(॥చెలు॥)
అంగన విభువి జూచి అరనవ్వు నవ్వె నిట్టె
యింగితానఁ గడమ నవ్వెందు దాచెనే
అంగమెల్ల మెఱుగులే అందు దాఁచ నిమ్ములేదు
వుంగిటి గనుగొనల నుండకుండీనా

(॥చెలు॥)
జలజాక్షి పతిఁ జూచి సగము మాటలఁ దిట్టె
యెలమిఁ గడమదొడ మెందు దాఁచెనే
తలఁపెల్ల దమకమే దాఁచ జోటు లేదెందు
పలుకుఁబంతములోనె పైకొనకుండీనా

(॥చెలు॥)
కోమలి శ్రీవేంకటేశుఁ గూడి పరవశమందె
యేమరి కోరికలెల్ల నెందు దాఁచెనే
ప్రేమలెల్ల పెనవులే పిరిదియ్యఁ జోటులేదు
దోమటి రతులలోనే తోచకుండీనా

(||pallavi||)
sĕlulāla vūhiṁchi sĕpparamma
niluvĕlla muribĕme niṁḍaguṁḍīnā

(||sĕlu||)
aṁgana vibhuvi jūsi aranavvu navvĕ niṭṭĕ
yiṁgidānam̐ gaḍama navvĕṁdu dāsĕne
aṁgamĕlla mĕṟugule aṁdu dām̐sa nimmuledu
vuṁgiḍi ganugŏnala nuṁḍaguṁḍīnā

(||sĕlu||)
jalajākṣhi padim̐ jūsi sagamu māḍalam̐ diṭṭĕ
yĕlamim̐ gaḍamadŏḍa mĕṁdu dām̐sĕne
talam̐pĕlla damagame dām̐sa joḍu ledĕṁdu
palugum̐baṁtamulonĕ paigŏnaguṁḍīnā

(||sĕlu||)
komali śhrīveṁkaḍeśhum̐ gūḍi paravaśhamaṁdĕ
yemari korigalĕlla nĕṁdu dām̐sĕne
premalĕlla pĕnavule piridiyyam̐ joḍuledu
domaḍi radulalone tosaguṁḍīnā