చెలులాల విభునికిఁ జెప్పరే బుద్ది
(॥పల్లవి॥)
చెలులాల విభునికిఁ జెప్పరే బుద్ది
యెలమి విూరిందరు న న్నేల బాదించేరే
(॥చెలులాల॥)
కల్లనిదురలు వోఁగా కౌఁగిలించుకొందురటే
మల్లాడఁగా మోవిచవి మనసౌనటే
వుల్లాసము లేకుండఁగా వొడివట్టి
యెల్లవారుఁ గూడి యిప్పు డేల బోదించేరే
(॥చెలులాల॥)
బొమ్మల జంకించఁగాను పూఁచి విన్నవింతురటే
యెమ్మెఁ బెనఁగఁగా వీడె మిత్తురటవే
కమ్మి చప్పఁగా జూడఁగా కానుక లింపొందురటే
యిమ్ముల న న్నిందుకుఁగా యేల బోదించేరే
(॥చెలులాల॥)
సగ్గి నవ్వకుండగానుఁసరస మాడుదురటే
సిగ్గునఁ దప్పించుకోఁగా చే చాఁతురటే
అగ్గ మై శ్రీవేంకటేశుఁ డాతఁడే యిదె కూడె
యెగ్గు లేదు యింకా మరి యేల బోదించేరే
(||pallavi||)
sĕlulāla vibhunigim̐ jĕppare buddi
yĕlami viూriṁdaru na nnela bādiṁchere
(||sĕlulāla||)
kallaniduralu vom̐gā kaum̐giliṁchugŏṁduraḍe
mallāḍam̐gā movisavi manasaunaḍe
vullāsamu leguṁḍam̐gā vŏḍivaṭṭi
yĕllavārum̐ gūḍi yippu ḍela bodiṁchere
(||sĕlulāla||)
bŏmmala jaṁkiṁcham̐gānu pūm̐si vinnaviṁturaḍe
yĕmmĕm̐ bĕnam̐gam̐gā vīḍĕ mitturaḍave
kammi sappam̐gā jūḍam̐gā kānuga liṁpŏṁduraḍe
yimmula na nniṁdugum̐gā yela bodiṁchere
(||sĕlulāla||)
saggi navvaguṁḍagānum̐sarasa māḍuduraḍe
siggunam̐ dappiṁchugom̐gā se sām̐turaḍe
agga mai śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe yidĕ kūḍĕ
yĕggu ledu yiṁkā mari yela bodiṁchere