చెలులాల విభునికిఁ జెప్పరే బుద్ది
(॥పల్లవి॥)
చెలులాల విభునికిఁ జెప్పరే బుద్ది
చలపట్టి తను నింత సాదించవచ్చునా
(॥చెలు॥)
మాటలు పొంకములాయ మనసు లొక్కటులాయ
గాఁటపునేర్పు తనందే కానవచ్చెను
వొటలేక తనతో నే నూఁకొనేటిదాననా
యేఁటికిఁ జెప్పీ సుద్దు లెంతవడైనాను
(॥చెలు॥)
సేసలు కొప్పున నిండె సెలవుల నవ్వు నిండె
అసలువెట్టఁగ తానే అన్నిటా జాణ
వేసరక చేఁతలు భావించి చూచేదాననా
వొసరించి నను నెంత వొరసీఁ దా నిపుడు
(॥చెలు॥)
కోరికలు దైవారె కూటములఁ చెల్లవారె
సారెకు వలపు తానే చవిసేసెను
యీరీతి శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
పేరడి నింకా నెంత పెనఁగీ రతులకు
(||pallavi||)
sĕlulāla vibhunigim̐ jĕppare buddi
salabaṭṭi tanu niṁta sādiṁchavachchunā
(||sĕlu||)
māḍalu pŏṁkamulāya manasu lŏkkaḍulāya
gām̐ṭabunerbu tanaṁde kānavachchĕnu
vŏḍalega tanado ne nūm̐kŏneḍidānanā
yem̐ṭigim̐ jĕppī suddu lĕṁtavaḍainānu
(||sĕlu||)
sesalu kŏppuna niṁḍĕ sĕlavula navvu niṁḍĕ
asaluvĕṭṭam̐ga tāne anniḍā jāṇa
vesaraga sem̐talu bhāviṁchi sūsedānanā
vŏsariṁchi nanu nĕṁta vŏrasīm̐ dā nibuḍu
(||sĕlu||)
korigalu daivārĕ kūḍamulam̐ sĕllavārĕ
sārĕgu valabu tāne savisesĕnu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ
peraḍi niṁkā nĕṁta pĕnam̐gī radulagu