Selulaala vegirimcham jellunaa meegu

చెలులాల వేగిరించఁ జెల్లునా మీకు
Language

(॥పల్లవి॥)
చెలులాల వేగిరించఁ జెల్లునా మీకు
మలసి తా మన్నించితే మరుగుట గాక

(॥చెలు॥)
కూరిమి చాలనిపతిఁ గొసరఁగ నేమిటికి
సారెకు సిగ్గువడఁగ జరయ నేల
బీరములు నెరపఁగాఁ బెనఁగఁ దగవుగాదు
గారవించినప్పుడే కై కొనుట గాక

(॥చెలు॥)
తగవు దప్పినవేళ తప్పులు వట్టేది గాదు
మొగము చూడకుండఁగా మొక్కవచ్చునా
సొగయనిచోటను సుద్దు లడుగఁగ రాదు
నగినప్పుడే ఆ నాటుకొనీఁ గాక

(॥చెలు॥)
వింతవాఁడై యుండఁగాను వేఁడుకొనఁ జోటేది
పంతముతో నుండఁగాను పై కొందురా
యింతలో శ్రీవేంకటేశుఁడేలె నన్ను నిపుడే
సంతోసమాయ నిట్టె సేస వెట్టుటగాక

(||pallavi||)
sĕlulāla vegiriṁcham̐ jĕllunā mīgu
malasi tā manniṁchide maruguḍa gāga

(||sĕlu||)
kūrimi sālanibadim̐ gŏsaram̐ga nemiḍigi
sārĕgu sigguvaḍam̐ga jaraya nela
bīramulu nĕrabam̐gām̐ bĕnam̐gam̐ dagavugādu
gāraviṁchinappuḍe kai kŏnuḍa gāga

(||sĕlu||)
tagavu dappinaveḽa tappulu vaṭṭedi gādu
mŏgamu sūḍaguṁḍam̐gā mŏkkavachchunā
sŏgayanisoḍanu suddu laḍugam̐ga rādu
naginappuḍe ā nāḍugŏnīm̐ gāga

(||sĕlu||)
viṁtavām̐ḍai yuṁḍam̐gānu vem̐ḍugŏnam̐ joḍedi
paṁtamudo nuṁḍam̐gānu pai kŏṁdurā
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ḍelĕ nannu nibuḍe
saṁtosamāya niṭṭĕ sesa vĕṭṭuḍagāga