చెలులాల వీూ లేల చెలువుని దూరేరే
(॥పల్లవి॥)
చెలులాల వీూ లేల చెలువుని దూరేరే
తలఁపులో నతనికి దయవుట్టీఁ గాకా
(॥చెలులాల॥)
మనసురానిపని మాపుదాఁకాఁ జెప్పినాను
వినేటిటోలే కాని వేడుక లేదు
యెనయని చుట్టరిక మెటువలేఁ బొడిగినా
పెనగులాటే కాని ప్రియ మొనకూడదు
(॥చెలులాల॥)
పలిసి నొల్లని యట్టి వలపు లొడిగట్టిఁ గట్టితే
బలవంతకోలె కాని పాదుకొనదు
చలపట్టినచో నెంత సారె గిలిగించినాను
ఆలయికే కాని యించుకంత నవ్వురాదు
(॥చెలులాల॥)
తమిలేని కౌఁగిలి తా నెంత బిగించినాను
చెమటలే నిండు గాని సెలవు గాదు
అనుర శ్రీవేంకటేశుఁ డంతలోనే నన్ను గూడె
సమరతులౌఁగాని చవి దప్పదింకను
(||pallavi||)
sĕlulāla vīూ lela sĕluvuni dūrere
talam̐pulo nadanigi dayavuṭṭīm̐ gāgā
(||sĕlulāla||)
manasurānibani mābudām̐kām̐ jĕppinānu
vineḍiḍole kāni veḍuga ledu
yĕnayani suṭṭariga mĕḍuvalem̐ bŏḍiginā
pĕnagulāḍe kāni priya mŏnagūḍadu
(||sĕlulāla||)
palisi nŏllani yaṭṭi valabu lŏḍigaṭṭim̐ gaṭṭide
balavaṁtagolĕ kāni pādugŏnadu
salabaṭṭinaso nĕṁta sārĕ giligiṁchinānu
ālayige kāni yiṁchugaṁta navvurādu
(||sĕlulāla||)
tamileni kaum̐gili tā nĕṁta bigiṁchinānu
sĕmaḍale niṁḍu gāni sĕlavu gādu
anura śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalone nannu gūḍĕ
samaradulaum̐gāni savi dappadiṁkanu